E-Paper
Advertisement

Mithra Mandali : కన్ఫ్యూజన్‌లో మిత్రమండలి.. రంగంలోకి దిగిన బన్నీ వాస్ ?

Mithra Mandali : కన్ఫ్యూజన్‌లో మిత్రమండలి.. రంగంలోకి దిగిన బన్నీ వాస్ ?
Advertisement

Mithra Mandali : ‘మిత్ర మండలి’ మూవీ… వచ్చే వారం అక్టోబర్ 16న ఈ మూవీ థియేటర్స్‌‌లోకి రాబోతుంది. హీరోగా ఈ మధ్య ఫెయిల్ రిజల్డ్స్ అందుకుంటున్న ప్రియదర్శి ఈ సినిమాలో మెయిన్ లీడ్ పాత్ర చేస్తున్నాడు. తమిళ యూట్యూబర్ నిహరిక NM ఈ సినిమాతో తెలుగు డెబ్యూ చేస్తుంది. అయితే, మరో 7 రోజుల్లో రిలీజ్ డేట్ పెట్టుకుని, ఈ మూవీ టీం ఇప్పుడు కన్ఫ్యూజన్‌లో ఉన్నారట. ఆ కన్ఫ్యూజన్ దేని గురించో ఇప్పుడు చూద్దాం…

ప్రియదర్శి పులికొండ… కమెడియన్ పాత్రలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు ఇలా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈయన లాస్ట్ మూవీ ఇంద్రగంటి మోషన కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి డైరెక్షన్ కాబట్టి ఈ సినిమాపై మినిమం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. నిజానికి మూవీ టైంలో అదే జరిగింది. కానీ, ఈ మూవీ ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఫలితంగా ప్రియదర్శి కెరీర్‌లో మరో ఫెయిల్యూర్ మూవీ పడిపోయింది.

Advertisement

ఇప్పుడు ప్రియదర్శి… విజయేంద్ర అనే డైరెక్టర్‌తో ఈ మిత్ర మండలి అనే సినిమా చేస్తున్నాడు. ఇండస్ట్రీలో టాప్ కమెడయన్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. అలాగే ఈ సినిమాకు నిర్మాతలు కూడా కాస్త ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. బన్నీ వాస్ వర్క్స్, అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాలో భాగం అయ్యాయి.

మూవీ టీం కన్ఫ్యూజ్…?

ఇండస్ట్రీలో టాప్ కమెడయన్స్ అందరూ ఉన్నా, ఇన్ని బ్యానర్లు భాగం అవుతున్నా… అన్నిటి కంటే ముఖ్యంగా టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ బ్యాక్ సపొర్ట్ ఉన్నా.. మిత్ర మండలి టీం కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

నిన్న ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. స్టోరీ ఏంటో అర్థం కాకుండా ఆ ట్రైలర్‌ను కట్ చేశారు. దీనిపై ఇప్పటికే కామెంట్స్ వచ్చాయి. దీని కారణం.. డబ్బింగ్ అని తెలుస్తుంది. ఈ మూవీకి డబ్బింగ్‌ను నిన్న (బుదవారం) పూర్తి చేశారట. డబ్బింగ్ అయిన వెంటనే, ట్రైలర్ కట్ చేసినట్టు తెలుస్తుంది.

అవుట్ పుట్‌పై అనుమానాలు ?

అయితే, డబ్బింగ్ తర్వాత అవుట్ పుట్ సరిగ్గా రాలేదనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ట్రైలర్ నుంచి ఎలాంటి బజ్ రాకపోవడం అనేది ఇప్పటికే ఓ మైనస్ అయిపోయింది మూవీ యూనిట్‌కి. ఇప్పుడు అవుట్ పుట్ పై అనుమానాలు మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయట.

రంగంలోకి బన్నీ వాస్ ?

ఈ గందరగోళ పరిస్థితులను క్లీయర్ చేయడానికి బన్నీ వాస్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. మిత్ర మండలి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీంటిని స్వయంగా చూస్తున్నారట. బన్నీ వాస్ ఎంట్రీతో అయినా.. మిత్ర మండలి సేఫ్ అయి… ప్రియదర్శిపై ఎఫెక్ట్ పడకుండా ఉంటుందా లేదో చూడాలి మరి.

Related News

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

Big Stories

Advertisement
×