Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున టాలీవుడ్ మన్మథుడు అన్న విషయం అందరికీ తెల్సిందే. ఇక హీరోయిన్ టబుతో నాగ్ కు రిలేషన్ ఉందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటనే. అంతేనా నాగ్ కోసమే టబు పెళ్లి కూడా చేసుకోకుండా ఆగిపోయిందని రూమర్ కూడా ఉంది. ఇండస్ట్రీలో కొన్ని జంటలు ఉంటాయి. నిజంగా ఆ జంటను స్క్రీన్ పై చూస్తే ప్రేమికులు అంటే ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది. వారిని ఎన్ని సినిమాల్లో జంటగా చూసినా అస్సలు బోర్ కొట్టదు. అలాంటి జంటల్లో నాగార్జున – టబు ఒకటి.
నిన్నే పెళ్లాడతా సినిమాతో నాగ్- టబు జంట ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. వారిద్దరిని చూసిన ప్రేక్షకుల మనసులు ఎటో వెళ్లిపోయాయి అంటేఅతిశయోక్తి కాదు. అందులో వీరి రొమాన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ టాప్ పెయిర్ లిస్ట్ లో నాగ్ – టబు పేరు యాడ్ అయ్యింది. ఈ సినిమా తరువాత ఆవిడా మా ఆవిడే చేసింది. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
అలా నాగ్- టబు మధ్య ప్రేమ చిగురించడం, నాగ్ కోసం టబు అలా సింగిల్ గా మిగిలిపోవడం జరిగిందని వార్తలు వచ్చాయి. సిసింద్రీలో టబు స్పెషల్ సాంగ్ చేయడం కూడా నాగ్ కోసమే. ఇప్పుడు ఈ జంట గురించి అంత స్పెషల్ గా ఎందుకు మాట్లాడడం అంటే.. చాలా గ్యాప్ తరువాత వీరిద్దరూ కలిసి మరోసారి స్క్రీన్ ను పంచుకుంటున్నారట.
అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన వందవ సినిమాపై ఫోకస్ పెట్టిన విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో టబును హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక నాగ్ – టబు పెయిర్ అనేసరికి ఫ్యాన్స్ మరోసారి వీరిద్దరి రిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో వీరి గురించి రకరకాల వార్తలు వచ్చాయి.
నాగ్ – టబు మధ్య ఉన్న రిలేషన్ గురించి అమల ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన నాగ్ ఇంట్లోనే ఉంటుంది. దానికి కారణం అమల – టబు మంచి ఫ్రెండ్స్ అంట. సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా వీరు ఫ్రెండ్స్ అని నాగ్ చెప్పుకొచ్చాడు. అందుకే వారు ముగ్గురు కూడా ఇప్పటికీ కలిసి ఉంటున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా నాగ్ మావా.. టబుతో మళ్ళీ రొమాన్స్ అంటే.. ఫ్యాన్స్ అందరూ సంతోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో టబు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.