E-Paper
Advertisement

ప్రియాంక చోప్రా బర్త్ డే ట్రీట్.. ‘వారణాసి’ సర్ప్రైజ్ అదిరిపోయింది..

ప్రియాంక చోప్రా బర్త్ డే ట్రీట్.. ‘వారణాసి’ సర్ప్రైజ్ అదిరిపోయింది..
Advertisement

Varanasi Movie : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం వారణాసి.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. భారీ బడ్జెట్ ఎక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఈమెకు ఒక మైలురాయి అవుతుందని అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బర్త్డే సందర్భంగా నేడు వారణాసి టీమ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఆమె బర్త్డే సందర్భంగా విసెష్ తెలుపుతూ ఈ సినిమా నుంచి రెండు ఫోటోలను రిలీజ్ చేశారు.. అందులో ఒకటి మందాకినీ లుక్.. ఈ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఆ పోస్టర్ ని చూసిన అభిమానులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్క అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మందాకిని ఎలా ఉందో మీరు కూడా ఇక్కడ ఒకసారి చూసేయండి…

బర్త్ డే సర్ప్రైజ్ అదిరిపోయింది..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుంచి వచ్చే సినిమాలను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో ఆయన వారణాసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇవాళ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి రెండు పోస్టర్లు బయటికి వచ్చాయి. అందులో ఒకటి మందాకిని లుక్ లో ఉన్న పోస్టర్, మరొకటి ప్రియాంక చిల్ మూడ్లో ఉన్న పిక్. డైరెక్టర్ రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రియాంక చోప్రా కు బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.. అదే విధంగా హీరో మహేష్ బాబు ఈ పవర్‌ఫుల్ లుక్‌ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటూ ప్రియాంకకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..

Advertisement

వారణాసి మూవీ విషయానికొస్తే…

రాజమౌళి సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇది కూడా దాదాపు 1500 కోట్లకు పైగా బడ్జెట్ ని కేటాయించినట్లు తెలుస్తుంది. భారీ ప్రాజెక్ట్‌లో ప్రధాన విలన్ ‘కుంభ’ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.. ఇందులో నటిస్తున్న యాక్టర్స్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుంది అని తెలుస్తుంది. మహేష్ బాబు అత్యధిక రెమ్యూనరేషన్ 150 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా భారీగానే పారితోషకం అందుకుంటున్నారు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా జనాలని ఆకట్టుకున్నాయి.. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి…

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా… ప్రభావతి ఫుల్ హ్యాపీ.. మేనేజర్ కుట్రతో మీనా బలి..

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×