E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో మిస్సమ్మ పూజ చేయించడం లేదని హోమం చేయిస్తుందని చంభా మనోహరికి చెప్తుంది. మనోహరి పూజ అయితే ఏంటి..? హోమం అయితే ఏంటి..? రెండు ఒక్కటి కాదా అని అడిగితే ఉత్తి పూజ అయితే ఏం కాదు కానీ హోమం చేయడానికి మిస్సమ్మ ఏర్పాట్లు చేస్తుందంటే అంజు లోపల ప్రచండ ఉన్నాడన్న విషయం భాగీకి తెలిసిపోయింది అంటూ చంభా చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. అప్పుడే అమర్‌ ఇంటికి స్వామిజీ తన శిష్యులతో వస్తాడు. స్వామిజీని చూసిన రాథోడ్‌ మిస్సమ్మను పిలుస్తాడు. స్వామిజీ వచ్చారని చెప్తాడు.

మిస్సమ్మ, అమర్‌, పిల్లలను తీసుకుని స్వామిజీకి ఎదురెళ్లి ఇంట్లోకి స్వాగతం పలుకుతారు. స్వామి అందరినీ గమనించి అమర్‌ ఆరోగ్యం గురించి అడిగి అంజు కనిపించడం లేదని అడుగుతాడు. అంజు లోపల రెడీ అవుతుందని మిస్సమ్మ చెప్తుంది. లోపల రెడీ అయి మనోహరి దగ్గరకు వచ్చిన అంజులోని ప్రచండను చూసి మనోహరి కోపంగా తిడుతుంది. నిన్ననే అంజును వదిలేసి వెళ్లిపోమ్మంటే నువ్వు వెళ్లలేదు ఇప్పుడు చూడు ఏమవుతుందో.. అంటూ కంగారుపడుతుంటే.. ప్రచండ ఏమీ కాదని ఏ స్వామీ తనను ఏమీ చేయలేరని చెప్తాడు.

Advertisement

స్వామిజీ ఇంట్లోకి అడుగుపెట్టబోతూ గడప దగ్గర కింద పడబోతాడు. అందరూ షాక్‌ అవుతారు. మిస్సమ్మ ఏమైంది స్వామి అని అడిగితే ఏమీ లేదమ్మా.. పదండి లోపలికి అంటూ లోపలికి వెళ్తారు. లోపల మనోహరి పక్కన నిలబడి ఉన్న అంజును చూస్తూ.. స్వామిజీ పలకరిస్తాడు. నన్ను చూడటానికి బయటకు రాలేదేం అంజు అని అడిగితే అంజు లోపల రెడీ అవుతున్నానని ఇప్పుడే కిందకు వచ్చానని చెప్తుంది. అమర్‌, స్వామీజీని రెస్ట్‌ తీసుకోమని చెబితే.. లేదని వెంటనే హోమం మొదలుపెట్టి దేవదూతలను ఆహ్వానించాలని చెప్తాడు. ఆ మాటలకు అంజులో ఉన్న ప్రచండ భయపడిపోతాడు. మిస్సమ్మ హోమానికి అంతా సిద్దంగా ఉంది స్వామి అని చెబితే.. స్వామి వెళ్లి హోమం దగ్గర కూర్చుని మొదలు పెడుతుంటాడు. ప్రచండ మనోహరికి సైగ చేయగానే.. మనోహరి, చంభా రూంలోకి వెళ్లిపోతారు. ప్రచండ కూడా వెనకాలే రూంలోకి వెళ్తాడు. చంబా డోర్‌ క్లోజ్‌ చేస్తుంది.

మనోహరి కోపంగా ప్రచండను తిడుతుంది. వెంటనే అంజును వదిలేసి వెళ్లిపోమ్మని చెప్తాడు. చంభా కూడా కోపంగా అక్కడ హోమం మొదలైతే నీ శక్తులన్నీ క్షీణించిపోతాయని వార్నింగ్‌ ఇస్తుంది. అయితే అంత వరకు ఇక్కడే ఉండనని తాను వచ్చిందే బుజ్జమ్మ శక్తులు తీసుకెళ్లడానికని.. ఆ శక్తులు తీసుకునే వెళ్తానని చెప్తాడు ప్రచండ. ప్రచండ మాటలకు మనోహరి కోపంగా ఇప్పుడు ఈ టైంలో బుజ్జమ్మను ఎలా బయటకు తీసుకెళ్తావు.. శక్తులు ఎలా తీసుకుంటావు.. అంటూ నవ్వితే.. బయటికే తీసుకెళ్లాలా..? చూస్తూ ఉండండి ఆ హోమం మొదలయ్యేలోపు తాను బుజ్జమ్మ శక్తులు తీసుకుంటానని చెప్తాడు. మనోహరి, చంభా ఆయోమయంగా చూస్తుంటారు. ప్రచండ తన శక్తితో డోర్‌ ఓపెన్‌ చేసుకుని బయటకు వెళ్తాడు.

Advertisement

బయట స్వామి ఐదు నిమిషాల్లో హోమం మొదలు పెడదామని చెప్పగానే.. అమర్‌ అలాగే స్వామిజీ అంటాడు. అప్పుడే అమర్‌ తన ఫోన్‌ రూంలో చార్జింగ్‌ పెట్టానని అనుకుంటుంటే.. బుజ్జమ్మ డాడీ మీరు ఉండండి నేను తీసుకొస్తాను అంటూ పైన అమర్‌ రూంలోకి వెళ్తుంది. వెనకాలే ప్రచండ వెళ్తాడు. బుజ్జమ్మ ఇక్కడేం చేస్తున్నావు.. అని అడిగితే డాడీ ఫోన్‌ కోసం వచ్చానని చెప్పి ఫోన్‌ తీసుకుని వెళ్తుంటే.. ఫుట్‌బాల్‌ గురించి బుజ్జమ్మకు చెప్పి ఆ ఫుట్‌బాల్‌ గురించి డాడీకి తెలిస్తే పనిష్‌మెంట్‌ ఇస్తాడు. ముందు ఆ ఫుట్‌బాల్‌ తీసుకొద్దాం పద అంటూ బుజ్జమ్మను తీసుకుని మేడ మీదకు వెళ్తాడు ప్రచండ.

కింద స్వామిజీ అమృత ఘడియలు ఇప్పుడే మొదలయ్యాయి హోమం మొదలుపెడదాము అని చెప్తాడు. అప్పుడే మిస్సమ్మ అంజు, బుజ్జమ్మ లేదని ఆనంద్‌ను అడిగితే పైకి వెళ్లారు అని చెప్పగానే.. మిస్సమ్మ బుజ్జమ్మ, అంజు అంటూ పిలుస్తూ.. పైకి వెళ్తుంది. అంతా గమనిస్తున్న చంభా సమయం లేదు మనోహరి మనం పారిపోదాం అంటూ భయపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

ఏంటి.. సుధీర్ కి అప్పుడే పెళ్ళైపోయిందా.. వైరల్ అవుతున్న పిక్స్!

దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!

Big Stories

Advertisement
×