E-Paper
Advertisement

SSMB 29 : చీరలో లేడీ జేమ్స్ బాండ్ స్టైల్ లో ప్రియాంక, మందాకిని ఫస్ట్ లుక్ అదుర్స్

SSMB 29 : చీరలో లేడీ జేమ్స్ బాండ్ స్టైల్ లో ప్రియాంక, మందాకిని ఫస్ట్ లుక్ అదుర్స్
Advertisement

SSMB29 : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరియర్ లో వస్తున్న 29వ సినిమా ఇది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఈ సినిమా కోసం క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలు పృధ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ పలు పోస్టర్స్ నుంచి కాపీ చేసి విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. మరి కొంతమంది మాత్రం రాజమౌళి గట్టిగానే ఏదో ప్లాన్ చేశాడు పవర్ ఫుల్ చూపించబోతున్నాడు అంటూ పాజిటివ్ కామెంట్స్ కూడా చేశారు.

ప్రియాంక చోప్రా లుక్ విడుదల 

Advertisement

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో కనిపిస్తుంది. తనకి సంబంధించిన లుక్ కూడా విడుదల చేశారు. అయితే పసుపు కలర్ శారీలో గన్ పట్టుకొని పవర్ఫుల్ గా దేన్నో టార్గెట్ పెడుతుంది మందాకిని.

ఆ గన్ నుండి విడుదలైన బుల్లెట్ కూడా గమనించవచ్చు. అయితే ఆ ఫోటోకు వెనుకున్న బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఒక గుహలా అనిపిస్తుంది. దీనిని బట్టి రాజమౌళి పెద్దగానే ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది.

Advertisement

భారీ ఈవెంట్

ఈ సినిమాకి సంబంధించిన భారీ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీ లో జరగనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జియో హాట్ స్టార్ లో ఈవెంట్ స్ట్రీమింగ్ కి వస్తుంది.

ఈ సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నీ కూడా చెరిగిపోతాయి అని చాలామంది ఊహిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ ఈ సినిమాలో షాకింగ్ గా అనిపిస్తుంది. ఇప్పటివరకు మహేష్ బాబుని అలా ఎవరూ చూపించలేదు.

లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో మహేష్ బాబు హాలీవుడ్ హీరోల అనిపిస్తున్నాడు. మొత్తానికి జక్కన్న తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చూపించే పనిలో పడ్డాడు.

ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన సంచారి అనే పాట విపరీతంగా వైరల్ అవుతుంది. శృతిహాసన్ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతో ఈ పాటను ఆలపించారు. కేవలం రాజమౌళి సినిమాకే ఈ స్థాయిలో కీరవాణి మ్యూజిక్ ఇస్తారా అని మరోసారి అందరికీ ఆలోచన కలిగింది. ఈ సినిమా 2027 లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి

Also Read: Simbhu : నా సినిమాకు 30 లక్షలు ఇచ్చారు, కానీ అది తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×