E-Paper
Advertisement

OTT Movie : ఐలాండ్‌లో అర్ధరాత్రి అమ్మాయిల అరాచకం… నెక్స్ట్ ఏమవుతుందన్న టెన్షన్ కే పోతారు

OTT Movie : ఐలాండ్‌లో అర్ధరాత్రి అమ్మాయిల అరాచకం… నెక్స్ట్ ఏమవుతుందన్న టెన్షన్ కే పోతారు
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక థాయ్ హారర్ మూవీ రీసెంట్ గా అడుగు పెట్టింది. పెట్టిపెట్టగానే అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అమెజాన్ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమా, థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా డిజిటల్ లోకి వచ్చేసింది. ఈ కథ ఒక ఇలాండ్ లో కఠినమైన స్కూల్ కి వెళ్ళిన ఒక ఆమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అక్కడికి వెళ్ళాక దెయ్యం ఎంట్రీతో అందరికీ ప్యాంట్లు తడిచిపోతాయి. ఈ సినిమాని ఒంటరిగా చూడకపోవడమే మంచిది. అందులోనూ రాత్రి పూట అస్సలు చూడకండి. ఈ సినిమా పేరు ఏమిటి ? దీని కథ ఏంటి ?
అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

పోక్‌పాంగ్ పైరాచ్ ఖుమ్వాన్ దర్శకత్వంలో 2025 అక్టోబర్ 23న ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన థాయిలాండ్ సూపర్‌ నాచురల్ హారర్ మూవీ ‘హోస్ట్’ (Host). ఇందులో తితియా జిరాపోర్న్‌సిల్ప్ (ఇంగ్), వెరిన్సారా తుంగ్‌కిట్సువానిచ్ (ఏమ్), పిసిట్‌పోల్ ఎకాఫాంగ్‌పిసిట్ (పిన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 125 నిమిషాల రన్‌ టైమ్ తో ఐ యండిబిలో 7.2/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇంగ్ అనే టీనేజ్ అమ్మాయి ఏదో క్రైమ్ చేస్తుంది. దీంతో ఒక మారుమూల ద్వీపంలో ఉన్న కఠినమైన బాలికల పాఠశాలకు ఆమెను పంపిస్తారు. అక్కడ రూల్స్ బాగా స్ట్రిక్ట్. సీనియర్ అమ్మాయిలు జూనియర్స్‌ని బాగా ర్యాగింగ్ చేస్తుంటారు. ఇంగ్ కొత్తగా వచ్చినందున బాగా ఇబ్బంది పడుతుంది. అక్కడ పిన్ అనే అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ పెట్టుకుంటుంది. అయితే అక్కడ రాత్రిపూట స్ట్రేంజ్ సౌండ్స్, బొమ్మలు కదలడం, వాయిసెస్ వినిపించడం మొదలవుతాయి. అక్కడా ఒక ఘోస్ట్ ఆమెకు కనబడుతూ ఉంటుంది. ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు, ఇంగ్‌కు థాయ్ పురాణాలలో ఉన్న “మే సూ” అనే ఒక ఆత్మ గురించి తెలుస్తుంది. అది పిల్లలను, దుష్ట శక్తుల నుండి కాపాడే ఒక దైవంగా కూడా చెప్పుకుంటారు.

Read Also : భర్తను చంపడానికి ఇద్దరమ్మాయిల ప్లాన్.. అన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, థ్రిల్లింగ్ టర్న్స్ ఉన్న కొరియన్ క్రైమ్ డ్రామా

Advertisement

కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఇంగ్‌కు ఈ పురాణానికి మధ్య ఏదో ఒక సంబంధం ఉందని తెలుస్తుంది. మరో వైపు ఆ స్కూల్ లో స్టూడెంట్స్ ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెడతారు. ఇంగ్ ఆ వేధింపులను తట్టుకోలేక పోతుంది. అప్పట్నుంచి స్కూల్‌లో హారర్ మొదలవుతుంది. సీనియర్ అమ్మాయిలు ఒక్కొక్కరుగా చచ్చిపోతుంటారు. ఇక క్లైమాక్స్ లో ఘోస్ట్ గురించి ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? ఆ స్కూల్ లో ఘోస్ట్ ఎందుకు ఇంగ్ కి కనబడుతుంది ? దాని గతం ఏమిటి ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ థాయ్ లాండ్ సూపర్‌నాచురల్ హారర్ మూవీని చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×