E-Paper
Advertisement

Dating Apps: సింగిల్స్‌ కు వల వేస్తున్న డేటింగ్ యాప్స్.. హైదరాబాదులో ఇవి బాగా ఫేమస్, జర భద్రం గురూ!

Dating Apps: సింగిల్స్‌ కు వల వేస్తున్న డేటింగ్ యాప్స్.. హైదరాబాదులో ఇవి బాగా ఫేమస్, జర భద్రం గురూ!
Advertisement

Dating Apps for Singles:

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ యువత గాడ్జెట్లకు అతుక్కుపోతున్నారు. ఆఫీస్ కు వెళ్తే కంప్యూటర్స్, ఇంట్లో ఉంటే ల్యాప్ టాప్ లు లేదంటే ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు. అదే సమయంలో చాలా మంది యువత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్ లో అడుగు పెడుతున్నారు. హాస్టళ్లు లేదంటే అద్దె గదుల్లో ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఒంటరిగా ఉండే యువతను ఆకట్టుకునేందుకు డేటింగ్ యాప్స్ ప్రయత్నిస్తున్నాయి. తమ లాంటి ఆలోచనలు, ఆసక్తులు ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, ఈ యాప్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు అపరిచిత వ్యక్తులతో ముఖ్యమైన విషయాలను పంచుకోవద్దంటున్నారు.

హైదరాబాద్ లో ఫేమస్ డేటింగ్ యాప్స్!

⦿ హింజ్

హైదరాబాద్ లో ఉంటున్న సింగిల్స్ ఎక్కువగా ఉపయోగించే డేటింగ్ యాప్ ఇది. పనికిరాని బాతాఖానీ కాకుండా పనికి వచ్చే విషయాల గురించి చర్చించుకునే వేదికగా కొనసాగుతుంది. ఇందులోని యూజర్లు పూర్తి వివరాలతో కూడిన ప్రొఫైల్స్ ను కలిగి ఉంటారు. ఇది హైదరాబాద్‌ లోని క్యాజువల్ డేటింగ్ కంటే, పూర్తి భిన్నంగా ఉంటుంది. అర్థవంతమైన పరిచయాలను ఇష్టపడే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

⦿ బంబుల్

Advertisement

ఈ యాప్ యువతులకు స్ట్రెయిట్ మ్యాచ్‌ లలో సాయపడుతుంది. సేఫ్టీ, రెస్పెక్ట్ రెండూ ఇందులో లభిస్తాయి. హైదరాబాద్‌ లో ఉంటున్న యంగ్ ప్రొఫెషనల్స్, కాలేజ్ స్టూడెంట్స్ బంబుల్ ను బాగా ఉపయోగిస్తున్నారు.

⦿ టిండెర్

టిండెర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే యాప్. హైదరాబాద్‌ లో కూడా చాలా యూజర్ బేస్ ఉంది. ఇందులోని స్వైప్ ఫీచర్ బాగా ఆకట్టుకుంటుంది. ఇది ఫ్రెండ్షిప్, హుక్ అప్ కు సాయపడుతుంది. పెద్ద సంఖ్యలో యూజర్లతో దూసుకుపోతుంది.

⦿ OkCupid

Advertisement

తమ లాంటి ఆలోచనలను కలిగి ఉన్న సింగిల్స్ తో పరిచయాలు పెంచుకునేందుకు దీనిని ఉపయోగిస్తారు. హైదరాబాద్‌ లోని సింగిల్స్‌ ను  విలువలు, ఆసక్తులు, లైఫ్ స్టైల్ హాబీస్ ఆధారంగా ఒకరికొకరు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సీరియస్ రిలేషన్ షిప్ కోసం వెతుకుతున్న వారికి ఎంతో యూజ్ ఫుల్ గా ఉంటుంది.

⦿ హాప్న్

ఫేట్ ను నమ్మేవారు ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇందులో పరిచయం అయ్యే వ్యక్తులను నిజ జీవితంలోనూ తోడుగా ఉండేలా చేస్తుంది. హైదరాబాద్ లాంటి కాస్మో పాలిటన్ సిటీలో ఒంటరిగా ఉండేవారికి జతను వెతికి పెట్టడంలో ఈ యాప్ సాయపడుతుంది.

Read Also:  వినాయకుడి గురించి గ్రోక్‌ను అడిగిన ఎలన్ మస్క్.. అది ఏం చెప్పిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

మీరు కూడా చక్కటి డిస్కర్షన్స్ జరిపేందుకు, వినోదం కోసం, కొత్త వ్యక్తులతో పరిచయం కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఈ యాప్స్ వాడుకోవడం మంచిది. అయితే, తెలియని వ్యక్తులతో ముఖ్యమైన విషయాలను పంచుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్స్ లో పరిచయమైన వారిని కలిసే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

Read Also:  జపాన్‌లో ఇళ్లన్నీ ఖాళీ.. ఫ్రీగా ఇచ్చేయడానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వం, మీకు కావాలా?

Related News

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

Big Stories

Advertisement
×