E-Paper
Advertisement

Karimnagar Accident: తెలంగాణాలో రోడ్ టెర్రర్.. రెండు కార్లు గాల్లో పల్టీలు కొట్టి.. స్పాట్ లో ఐదుగురు

Karimnagar Accident: తెలంగాణాలో రోడ్ టెర్రర్.. రెండు కార్లు గాల్లో పల్టీలు కొట్టి..  స్పాట్ లో ఐదుగురు
Advertisement

Karimnagar Accident: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ డ్యూటీ నిమిత్తం ఆర్‌ఐ, టైపిస్ట్, హెడ్ కానిస్టేబుల్‌ ఒక కారులో మంగళవారం కరీంనగర్ నుంచి బెజ్జంకి మండలానికి వెళ్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తున్న మరో కారు తిమ్మాపూర్‌ మండలం ఇందిరానగర్‌ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొడుతూ వచ్చి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్ వెళ్తున్న కారును వేగగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కారుల్లోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు చిన్న పిల్లలున్నట్లు సమాచారం. స్థానికులు సమాచారంతో ఎల్ఎండీ పోలీసులు ఘటనస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కరీనంగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

బొలెరో డివైడర్ ను ఢీకొట్టి

హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బొలెరో వెహికల్ అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. దీంతో పాటు ఎదురుగా వస్తున్న మరో కారును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బెజ్జంకి మండల రెవెన్యూ సిబ్బంది కలికోట సంతోష్, రమేష్, బెజ్జంకి హెడ్ కానిస్టేబుల్ తడగొండ కనకయ్యతో పాటు బొలెరోలో ప్రయాణిస్తున్న పెండ్యాల కిషన్ రెడ్డి, అతని భార్య విజయ, పెండ్యాల దివ్య తో పాటు ఆమె ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఎన్నికల విధుల్లో భాగంగా బెజ్జంకి రెవెన్యూ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ తనిఖీలకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని పోలీసులు కరీంనగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Also Read: Travel Bus Accident: ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఏపీ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఘటన, స్పాట్‌లో 11 మంది 

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో ఎక్కువ అవుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను ప్రమాదాల్లో నెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. హైవేలపై మితిమీరిన వేగంగా ప్రయాణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీసులు అంటున్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూ, పరిమిత వేగంతో ప్రయాణించాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×