E-Paper
Advertisement

Aswini Dutt Daughter wedding:  ఘనంగా అశ్వినీ దత్ కుమార్తె వివాహం..ఫోటోలు వైరల్!

Aswini Dutt Daughter wedding:  ఘనంగా అశ్వినీ దత్ కుమార్తె వివాహం..ఫోటోలు వైరల్!
Advertisement

Aswini Dutt Daughter wedding: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్(Aswini Dutt) ఒకరు. వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు ఈయన వారసులుగా తన కుమార్తెలు స్వప్న, ప్రియాంక నిర్మాతలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అశ్విని కుమార్తెలుగా వీరిద్దరూ మాత్రమే అందరికీ సుపరిచితం అయితే ఈయనకు మూడో కుమార్తె కూడా ఉందని తెలుస్తోంది. అశ్విని దత్ మూడో కుమార్తె పేరు స్రవంతి దత్(Sravanthi Dutt) .

పెళ్లి పీటలు ఎక్కిన స్రవంతి దత్..

స్రవంతి పెద్దగా సినిమాల పరంగా యాక్టివ్ గా ఉండరని తెలుస్తోంది. అయితే తాజాగా స్రవంతి వివాహపు(Wedding) వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాదులో వీరి వివాహపు వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు. గత రెండు నెలల క్రితం స్రవంతి విక్రమ్(Vikram) అనే వ్యక్తితో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. తాజాగా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కినట్టు తెలుస్తుంది.

హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు..

Advertisement

గత కొద్దిరోజులుగా స్రవంతి పెళ్లికి సంబంధించిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికూతురు ఫంక్షన్, సంగీత్ వంటి కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో సినీ సెలెబ్రిటీలు హాజరవుతూ సందడి చేశారు. ఇక తాజాగా వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవల వీరి పెళ్లిలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ దంపతులతో పాటు ప్రభాస్ కూడా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే.

అశ్వినీ దత్ అల్లుడిగా నాగ్ అశ్విన్….

Advertisement

ఇక అశ్వినీ దత్ మూడవ అల్లుడు విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన ఏం చేస్తారనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. ఇక అశ్వినీ దత్ రెండవ అల్లుడు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన ప్రియాంక దత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అశ్విన్ సైతం ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ దర్శకుడిగా మారారు. ఇటీవల కల్కి సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రియాంక, స్వప్న ఇద్దరు కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇక నిర్మాతలుగా వీరు మహానటి, సీతారామం వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

Also Read: Vrushakarma film: నాగచైతన్య ‘ వృషకర్మ’ టైటిల్ అర్థం ఏంటో తెలుసా?

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×