E-Paper
Advertisement

Bunny Vas : మిత్రమండలి వల్ల భారీ నష్టం.. ఒప్పుకున్న నిర్మాత బన్నీ వాసు

Bunny Vas : మిత్రమండలి వల్ల భారీ నష్టం.. ఒప్పుకున్న నిర్మాత బన్నీ వాసు
Advertisement

Bunny Vas : బన్నీ వాసు సినిమాలు అంటే… ఆడియన్స్‌కు ఓ నమ్మకం ఏర్పడింది. చిన్న సినిమాలు.. చిన్న కాస్టింగ్‌ ఉన్నా… ఆ సినిమాలు పెద్ద విజయం సాధిస్తాయి. ఇప్పటికే అది ప్రూవ్ అయింది. కానీ, ఓ సారి లెక్క తప్పింది. అదే మిత్ర మండలి. ఈ సినిమా రిలీజ్ టైంలో డిజాస్టర్ టాక్ వచ్చినా… వాళ్లు ఒప్పుకోలేదు. కానీ, ఇప్పుడు బహిరంగంగా అది ఫెయిల్యూర్ మూవీ అని.. తమకు నష్టం తెప్పించిన మూవీ అంటూ చెప్పుకుంటున్నారు.

బన్నీ వాసు, వంశీ నందిపాటుతో పాటు మరి కొంత నిర్మాతలు కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అలా వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్ టాక్ తెచ్చుకుంటూనే ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన ఈషా మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ వారం రిలీజ్ అయిన అరడజన్ సినిమాలకు ఈషా మంచి పోటీ ఇచ్చింది. కొన్ని ఏరియాల్లో లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు అతి దగ్గరలో ఉన్నాయని సమాచారం.

Advertisement

ఇప్పటి వరకు బానే ఉన్నా… బన్నీ వాసు సమర్పణలో వచ్చిన ఓ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదే.. మిత్రమండలి. బన్నీ వాసు సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ & వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కల్యాణ్‌ మంతెన, భాను ప్రతాప్‌, డా. విజయేందర్‌రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమాకు ఎస్. విజయేంద్ర దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 16న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

6 కోట్ల నష్టం..

మొత్తంగా, సినిమా ఓ ఫెయిల్యూర్‌గా నిలిచిపోయింది. అలాగే సినిమాకు భారీ నష్టం వచ్చిందని అప్పట్లో ఇండస్ట్రీ టాక్. తాజాగా ఆ సినిమా ఫెయిల్యూర్ గురించి.. నష్టాల గురించి నిర్మాత బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. మిత్రమండలి సినిమాల తమకు 6 కోట్ల వరకు నష్టం వచ్చిందని ఒప్పుకున్నాడు.

Advertisement

సినిమా ఫైనల్ అవుట్ పుట్ వచ్చిన తర్వాత చూసి… కామెడీ వర్కౌట్ అవుతుందని అనుకున్నాడట. కొన్ని సీన్స్ వచ్చినప్పుడు థియేటర్‌లో జనాలు తప్పకుండా నవ్వుతారని అంచనా వేశాడట. కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్స్‌ వచ్చినప్పుడు జనాలు నవ్వకుండా ఉండిపోయారట. దీంతో ఈ సినిమా ఫెయిల్యూర్ అయిందని అప్పనుడే ఫిక్స్ అయ్యాడట. అలాగే ఈ సినిమా విషయంలో ఏదో మిస్ అయిందని.. ఏదో మిస్టేక్ జరిగిందని అనుకున్నాడట. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

Big Stories

Advertisement
×