E-Paper
Advertisement

Sankranti Trains: సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్, స్టేషన్ల సమాచారం ఇదిగో

Sankranti Trains: సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్, స్టేషన్ల సమాచారం ఇదిగో
Advertisement

Sankranti Trains: సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఊరు విడిచి దూరంగా ఉంటున్న వాళ్లంతా సంక్రాంతికి సొంతూళ్లు వెళ్లి బంధు మిత్రులతో జాలీగా గడుపుతుంటారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. తాజాగా మరో 11 రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ మీదుగా తెలుగు రాష్ట్రాల్లో కీలక పట్టణాలకు స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది.

జనవరి 7 నుంచి 12 మధ్య

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే అదనంగా మరో 11 ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 7 నుంచి 12వ తేదీ మధ్య కాకినాడ-వికారాబాద్‌, వికారాబాద్‌-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్‌, సికింద్రాబాద్‌-పార్వతీపురం, పార్వతీపురం-కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌-వికారాబాద్‌ మధ్య రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్‌ కోచ్‌లతో పాటు సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైళ్ల బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమైంది.

ప్రత్యేక రైళ్లు ఇవే

Advertisement

1. కాకినాడ టౌన్-వికారాబాద్(07460).. 08.01.2026 నాడు సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.00 చేరుకుంటుంది.
2.వికారాబాద్ – పార్వతీపురం(07461).. 09.01.2026 & 11.01.2026.. సాయంత్రం 08.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 02.30 గంటలకు చేరుకుంటుంది.
3.పార్వతీపురం – వికారాబాద్(07462).. 10.01.2026 సాయంత్రం 06.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 చేరుకుంటుంది.
4.పార్వతీపురం – కాకినాడ టౌన్(07463).. 12.01.2026 సాయంత్రం 06.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 01.00 చేరుకుంటుంది.
5.సికింద్రాబాద్ – పార్వతీపురం(07464).. 08.01.2026 రాత్రి 11.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 02.30 గంటలకు చేరుకుంటుంది.
6.పార్వతీపురం – సికింద్రాబాద్(07465)..09.01.2026 సాయంత్రం 06.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.00 చేరుకుంటుంది.
7.కాకినాడ టౌడ్- వికారాబాద్(07186).. 07.01.2026 & 09.01.2026.. సాయంత్రం 04.45 గంటలకు బయలుదేరి మరుసటి ఉదయం 07.00 చేరుకుంటుంది.
8.వికారాబాద్-కాకినాడ టౌన్(07185).. 08.01.2026 రోజున సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజున ఉదయం 08.30 గంటలకు చేరుకుంటుంది.
9. వికారాబాద్-కాకినాడ టౌన్(07187).. 10.01.2026 తేదీన సాయంత్రం 7.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.00 గంటలకు చేరుకుంటుంది.

07460 / 07461 / 07186 / 07185 / 07187 రైళ్ల బుకింగ్‌లు 29.12.2025న ఉదయం 8.00 గంటలకు ఓపెన్ అయ్యాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Advertisement

Also Read: Karimnagar: కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణం.. యువకుడి వినూత్న నిరసన

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×