E-Paper
Advertisement

Visakhapatnam: ఏపీ వైపు భారత్‌ ఫోర్జ్‌.. వాటిలో పెట్టుబడులు, సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వైస్ ఛైర్మన్ భేటీ

Visakhapatnam: ఏపీ వైపు  భారత్‌ ఫోర్జ్‌..  వాటిలో పెట్టుబడులు, సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వైస్ ఛైర్మన్ భేటీ
Advertisement

Visakhapatnam: కూటమి సర్కార్ చూపు శుక్రవారం నుంచి జరగనున్న సీఐఐ సదస్సుపై ఫోకస్ చేసింది. సదస్సు ముందు దాదాపు 11 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు బుధవారం విశాఖ చేరుకున్నారు. అక్కడి వచ్చిన వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.

సదస్సు కోసం విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు

Advertisement

విశాఖ వేదికగా శుక్రవారం నుంచి సీఐఐ సదస్సు జరగనుంది. శుక్రవారం, శనివారం రెండురోజులపాటు జరగనున్న ఈ సదస్సు 100 దేశాల నుంచి వ్యాపారవేత్తలు వస్తారని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి  కేంద్రమంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు బుధవారం విశాఖ చేరుకున్నారు. సదస్సు కోసం ఏర్పాట్లను దగ్గరుండీ పర్యవేక్షించారు.

ఇప్పటికే దేశీయ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు.. ఇంకా వస్తున్నారు కూడా. ఈలోగా వచ్చిన వ్యాపారవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. బుధవారం రాత్రి నోవోటెల్‌ హోటల్‌లో భారత్‌ ఫోర్జ్‌ వైస్‌ ఛైర్మన్‌ అమిత్‌ కల్యాణి.. సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇరువురు మధ్య దాదాపు గంటకు పైగానే వివిధ అంశాలపై చర్చించారు.

Advertisement

భారత్‌ ఫోర్జ్‌ కంపెనీ వైస్ ఛైర్మన్‌తో భేటీ

ఏపీలో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు.. ఫోర్జ్‌ వైస్‌ ఛైర్మన్‌ అమిత్‌కు వివరించారు. ఆయనను శాలువాతో సత్కరించి అరకు కాఫీ గిఫ్ట్‌ ప్యాక్‌ను అందజేశారు. భారత్‌ ఫోర్జ్‌ పెట్టనున్న పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు.  అనుమతులు ఎంత వేగంగా ఇస్తున్నామనేది కూడా వివరించారు.  ఇప్పటికే చాలా కంపెనీలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఏపీలో భారత్‌ ఫోర్జ్‌ సంస్థ తరపున పరిశ్రమ ఏర్పాటుపై ఇరువురు నేతలు చర్చించారు. టూరిజం విభాగంలో గండికోట వద్ద రివర్‌ క్రూజ్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చింది. అలాగే తిరుపతి సమీపంలో అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్‌ సెన్సర్ల ఉత్పత్తి పరిశ్ర పెట్టాలని ఆలోచన చేస్తోంది. సుదీర్ఘ తీరప్రాంతం ఉండడంతో నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో అడ్వాన్స్‌డ్‌ ఉత్పత్తుల తయారీకి భారత్‌ ఫోర్జ్ ముందుకొచ్చింది.

ALSO READ:  టీటీడీకి త్వరలో ఐఏ చాట్‌బాట్..  దర్శనం మరింత ఈజీ

ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం దాదాపు 11 లక్షల వరకు పెట్టుబడులు ఆకర్షించినట్టు తెలుస్తోంది. తొలుత దేశీయ పారిశ్రామిక వేత్తలకు ప్రయార్టీ ఇస్తున్నారు. ఆ తర్వాత ఫారెన్ వ్యాపారవేత్తలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. గురువారం నుంచి దేశీయ, విదేశీ పారిశ్రామిక వేత్తలు విశాఖకు క్యూ కట్టనుంది.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×