E-Paper
Advertisement

Jr.NTR: జాతకం చూపించి మరీ ఎన్టీఆర్ తో సినిమా చేసిన ప్రొడ్యూసర్…అన్ని ఆయన పోలికలే అంటూ!

Jr.NTR: జాతకం చూపించి మరీ ఎన్టీఆర్ తో సినిమా చేసిన ప్రొడ్యూసర్…అన్ని ఆయన పోలికలే అంటూ!
Advertisement

Jr.NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నందమూరి వారసులు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఒకరు. ఎన్టీఆర్ చిన్న వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా నిర్మాత చంటి అడ్డాల (Chanti Addala)ఎన్టీఆర్ గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ఎన్టీఆర్ జాతకం చూపించిన చంటి అడ్డాల…

నిర్మాత చంటి అడ్డాల ఎన్టీఆర్ తో కలిసి అల్లరి రాముడు అనే సినిమా చేశారు. ఈ సినిమా సమయంలో ఈయన ఎన్టీఆర్ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ముందు ఎన్టీఆర్ పుట్టిన తేదీ సమయం గురించి ఒక జ్యోతిష్యుకి చెప్పడంతో ఆయన ఎన్టీఆర్ జాతకం చూసి ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారని చెప్పినట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా సక్సెస్ అందుకుంటారని జ్యోతిష్యుడు చెప్పినట్లు చంటి అడ్డాల వెల్లడించారు.

రాజకీయాలలో విజయం..

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ జాతకం మొత్తం తన తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ గారిలాగే ఉందని జ్యోతిష్యుడు చెప్పినట్టు చంటి అడ్డాల ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఎన్టీఆర్ రాజకీయాలలోకి ఏ సంవత్సరంలో వస్తారని చెప్పారు అంటూ ప్రశ్న ఎదురవడంతో సంవత్సరం ఏది అనేది చెప్పలేదు కానీ తన తాతయ్య లాగే రాజకీయాలలో కూడా ఉన్నత స్థాయిలో ఉంటారని చంటి అడ్డాల తెలియచేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని ఎంతో మంది అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

డ్రాగన్ పనులలో బిజీగా తారక్..

Advertisement

గతంలో ఎన్టీఆర్ రాజకీయాల పరంగా ఆసక్తి చూపిస్తూ తన తాతయ్య స్థాపించిన పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా చేశారు. కానీ ఇటీవల కాలంలో రాజకీయాల పట్ల పూర్తిగా ఆసక్తి తగ్గించారని, కేవలం సినిమా ఇండస్ట్రీపై మాత్రమే ఎన్టీఆర్ ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇక రాజకీయాలలోకి రావడం గురించి కూడా ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు. మరి భవిష్యత్తులో అయినా ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తారా? రారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా అంటే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన చివరిగా వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Also Read: Jani Master: జానీ మాస్టర్ కి అరుదైన గౌరవం.. మంచి రోజులు మొదలైనట్టే!

Related News

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×