E-Paper
Advertisement

నేరాలపై ఉమ్మడి దండయాత్ర.. దక్షిణాది రాష్ట్రాల పోలీసు బాస్‌ల మెగా మీట్!

నేరాలపై ఉమ్మడి దండయాత్ర.. దక్షిణాది రాష్ట్రాల పోలీసు బాస్‌ల మెగా మీట్!
Advertisement

Police Meeting: దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా శుక్రవారం తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దక్షణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం జరుగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీజీఐసీసీసీ)లో ఈ భేటీ నిర్వహిస్తున్నట్టు డీజీపీ సీ.వీ.ఆనంద్ తెలిపారు. సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ లకు చెందిన డీజీపీలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సంస్థల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, పరస్పర సహకారం, సమన్వయంతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

Advertisement

ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాల అనంతర పరిస్థితులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర సైబర్‌ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక నేరాలు, యువత నిరసనలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలు సమావేశం ఎజెండాలో ఉన్నాయి. అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాల కదలికలు, నేరగాళ్ల సమాచార మార్పిడి, నేరాల దర్యాప్తులో ఎదురవుతున్న సమస్యలు, ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే మార్గాలపై సమీక్షించనున్నారు.

Also Read: ఆడి కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి, బాధితుడ్ని తొక్కుకుంటూ వెళ్లిన డ్రైవర్!

Advertisement

మరోవైపు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న నూతన క్రిమినల్‌ చట్టాల అమలు తీరు, సముద్ర తీర ప్రాంతాల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, పోలీసింగ్‌ లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వంటి అంశాలపైనా విస్తృతంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేస్తే నేరాలను సమర్థంగా అరికట్టవచ్చన్న లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

Also Read: తెలంగాణలో ‘భూ భారతి’ డిజిటల్ రీ సర్వే స్టార్ట్.. రోవర్ పద్దతిలో భూముల కొలతలు!

Tags

Related News

రైతుల కష్టాలకు ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్!

తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి మృతి.. అసలేం జరిగిందంటే?

వచ్చే 8 నెలలు బిగ్ అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కీలక సూచనలివే?

ఇదేం విచిత్రం.. మూడు కార్పొరేషన్లకు 3 రకాల ఆర్థిక తారతమ్యాలా..?

తెలంగాణలో ‘భూ భారతి’ డిజిటల్ రీ సర్వే స్టార్ట్.. రోవర్ పద్దతిలో భూముల కొలతలు!

యాదగిరిగుట్టలో తీవ్ర విషాదం.. పుష్కరిణిలో నీరు త్రాగి చిన్నారి మృతి!

Big Stories

Advertisement
×