Ramayana OTT: భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రామాయణం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా రామాయణం ఆధారంగా మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సాయి పల్లవి (Sai Pallavi)జంటగా నటించిన చిత్రం రామాయణ (Ramayana). ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేతత్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించగా, సీత పాత్రలో సాయి పల్లవి సందడి చేయనున్నారు. ఇక విలన్ గా రావణాసురుడి పాత్రలో యశ్ (Yash)నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్(Jio Hot Star) కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామాయణ ఓటీటీ విడుదల విషయంలో హాట్ స్టార్ కీలక ప్రకటన చేసింది.
ఈ సినిమా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో భాగస్వామ్యంలో భాగంగా థియేటర్లలో విడుదలైన తర్వాత హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది. సాధారణంగా ఓటీటీలో విడుదలైన సినిమాలను చూడాలి అంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఈ సినిమాని మనం ఓటీటీలో చూడాలి అంటే కేవలం సబ్ స్క్రిప్షన్ ఉంటే సరిపోదని, ఈ సినిమా చూడాలి అంటే ముందుగా మరికొంత డబ్బును అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సినిమా చూడటానికి ఎంత మొత్తంలో ధర నిర్ణయిస్తారనే విషయాలను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఇలా రామాయణ సినిమా ఓటీటీ విషయంలో పే ఫర్ వ్యూ విధానానికి ప్రేక్షకులు ఎలాంటి ఆదరణ చూపుతారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను హాట్ స్టార్ 450 కోట్లకు కైవసం చేసుకున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి సుమారు నాలుగువేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: అవును నేను పెళ్లి చేసుకుంటున్నాను.. పెళ్లి వార్తలపై తేజ సజ్జ క్లారిటీ!