E-Paper
Advertisement

BRS : ముందు నీళ్లు..ఇపుడు యూరియా.. గులాబీలో క్లారిటీ మిస్!

BRS : ముందు నీళ్లు..ఇపుడు యూరియా.. గులాబీలో క్లారిటీ మిస్!
Advertisement

గులాబీ పార్టీ వ్యహరిస్తున్న తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటివరకు నదీ జలాల విషయంపై ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇప్పుడు యూరియాపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యల మేరకు సీఎం రేవంత్ అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించారు.సభలో నదీ జలాలపై చర్చిద్దాం.. దమ్ముంటే రావాలని ప్రతిపక్ష నేతకు సవాల్ విసిరారు. కానీ, కేసీఆర్ సభకు రాలేదు. సెషన్ ప్రారంభంలో ఒక్క రోజు వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. ఇవాళ సెషన్ ప్రారంభం కాగా ఆయన వస్తారనుకుంటే రాలేదు. దీంతో అటు ప్రజల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాడీవేడిగా పాలమూరుపై రచ్చ..

అసెంబ్లీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీద వాడీవేడిగా సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలు మొన్నటివరకు ఆరోపించిన అన్ని అంశాలపై సీఎం రేవంత్, మంత్రులు క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ముందస్తు ప్రిపరేషన్‌తో సభకు అయ్యారు.పాలమూరును పడావు పెట్టారని గగ్గోలు పెట్టిన కేసీఆర్ సభకే రాలేదు. దీంతో ఆ బాధ్యతను హరీశ్ రావు తన మీద వేసుకున్నారు. పాలమూరు డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడానికి కాంగ్రెస్ కారణమని ఇటీవల కేసీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ నీళ్ల విభజన చేసిన సిద్ధం చేసిన పేపర్ల మీద ఆంధ్రాకు 511, తెలంగాణకు 299 టీఎంలు ఒకే చెప్పి సంతకం చేసింది అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి నీళ్ల మంత్రి హరీశ్ రావు అని కుండబద్దలు కొట్టారు.దీనిపై ప్రతిపక్షం నుంచి సరైన సమాధానం కరువైంది.

యూరియా అంశంపై నిరసనలు..

Advertisement

అసెంబ్లీ ప్రారంభానికి ముందు రైతాంగానికి యూరియా సరఫరా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాంగణం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతాంగానికి ఓవైపు అధికారులు దగ్గరుండి యూరియాను సరఫరా చేస్తున్నారు. పెద్దమొత్తంలో రైతులు ఒకేసారి కేంద్రం వద్దకు రాగా ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతుండగా.. కొరత ఉందని గులాబీ నాయకులు అబద్ధాలు చెప్పడం ఏంటని అధికార పార్టీనేతలు ప్రశ్నిస్తున్నారు. నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చిన కేసీఆర్ సభకు రాకపోవడం.. తీరా చర్చ ఏర్పాటు చేశాక గులాబీ లీడర్లు మరో అంశం మీద నిరసనలు తెలపడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది ప్రజలను మోసం చేయడం కదా? అని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

Read Also : Kavitha : పిల్లకాకి.. మళ్ళీ హరీశ్‌రావును టార్గెట్ చేసిన కవిత!

Advertisement

అసలు గులాబీ పార్టీ నేతలు ఒక్క మాట మీద నిలబడరా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజలను డైవర్ట్ చేసి ఓట్లు దండుకోవడానికి, మరల అధికారం కోసమే కేసీఆర్ కృష్ణా నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చి సెంటిమెంట్ రగల్చాలని చూస్తున్నారని.. నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి సీఎం రేవంత్, మంత్రులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కదా? అని నిలదీస్తున్నారు. గులాబీ బాస్ తీరుపై మరోవైపు గులాబీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.తమకు ఎవరూ విలువనివ్వడం లేదని, ప్రజల్లోనూ తమకు పరపతి తగ్గిపోతుందనే భయంలో వారంతా ఉన్నట్టు పార్టీలోనే చర్చ జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×