Sai Rajesh: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా.. ‘కలర్ ఫొటో, బేబి’ సినిమాలను అందించిన ఎస్‌కేఎన్ (Producer SKN), సాయి రాజేశ్ నిర్మాణంలో రూపుదిద్దకుంటోన్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా.. సోమవారం ఈ సినిమా నుంచి ‘గుర్తుందా’ అనే సాంగ్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సాయి రాజేష్ (Sai Rajesh) మాట్లాడుతూ..
Also Read- ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది?- నటి హేమ
‘‘బేబి మూవీ సక్సెస్ తర్వాత మేము డబ్బుల వెనక పరుగులు పెట్టలేదు. ఒక మంచి కథతో మళ్లీ మూవీ చేయాలని భావించాం. ఈ క్రమంలోనే నా మనసుకు నచ్చిన ఒక కథను రాసుకున్నాను. ఏ కథ అయినా, రచయిత దగ్గర నుంచి దర్శకుడి దగ్గరకు వెళ్లి.. ఫైనల్‌గా స్క్రీన్ మీదకు వచ్చేసరికి అందులోని ఒరిజినాలిటీ ఎంతో కొంత పోతుంది. కానీ ఈ సినిమాను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి. నేను ‘బేబి’ మూవీని ఎంతో ప్రేమించి ఐదు గంటలు తీశాను. 3 గంటలకు ఎలా కుదించాలి అని ఆలోచిస్తున్న టైమ్‌లో రవి వచ్చి చాలా హెల్ప్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్‌లోనూ నాతోనే ఉన్నాడు. కృతజ్ఞతగా రవిని ఈ సినిమా చేయమని రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఒక గొప్ప సినిమా తీసిపెట్టి.. నాకే మంచి చేశాడు. అతను ఎంత ప్రతిభావంతుడైన దర్శకుడో ఈ సినిమా రిలీజ్ తర్వాత అంతా చూస్తారు. ఈ సినిమా కొంత భాగం నేను చూశాను. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. రవి అంత బాగా తెరకెక్కించాడు.
Also Read- స్విఫ్ట్, ఆల్టో కార్లు మాత్రమే తెలిసిన నాకు.. బెంజ్ కారు కొనే రేంజ్‌కి తీసుకెళ్లారు- SKN
ఈ చిత్రంలో హీరోకు సమానంగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర హీరోయిన్‌ది. ఒక తమిళ సినిమా చూసి ఆమెను ఈ చిత్రానికి సెలెక్ట్ చేశాం. గతేడాది తమిళ సినిమాకు ఫిలింఫేర్ తీసుకున్న శ్రీ గౌరి ప్రియ.. ఈసారి తెలుగు సినిమాకు తీసుకుంటుంది. అంత బాగా ఈ సినిమాలో తను పర్‌ఫార్మ్ చేసింది. అనంత శ్రీరామ్‌తో వర్క్ చేస్తే లిరిక్స్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన మీద పూర్తిగా ఆధారపడతా. బేబికి ఎంత మంచి సాంగ్స్ రాశారో అందరికీ తెలుసు. ఆయన పాట రాస్తే ఒకట్రెండు పదాలు మాత్రమే మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక వాక్యం కూడా పూర్తిగా ఛేంజ్ చేయలేదు. ధీరజ్ ఈ మూవీని మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నా లైఫ్‌లో తీసుకున్న మంచి నిర్ణయాల్లో ముఖ్యమైంది ఎస్‌కెఎన్‌తో జర్నీ. ఈ కథను పూర్తిగా నమ్మి మాతో ట్రావెల్ అయ్యే హీరో కావాలి. ‘క’ తర్వాత కిరణ్ ఒప్పుకున్న సినిమా ఇది. కథ చెప్పిన వెంటనే మీరు ఎలా చెబితే.. అలా ఈ మూవీ చేద్దామని సపోర్ట్ చేశారు.
ఇప్పటి వరకు అలాగే మూవీకి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా చేస్తున్న టైమ్‌లో ఆయనపై మరింత ఇష్టం పెరిగింది. కిరణ్ గురించి ఇప్పుడు కాదు, ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడతాను. కచ్చితంగా ఆయనకు ఒక మెమొరబుల్ మూవీ అవుతుంది. మణిశర్మ బీజీఎం వినేందుకే రిపీటెడ్‌గా ఎన్నో సినిమాలు చూశాను. ఈ సినిమాకు తనదైన శైలీలో సంగీతాన్ని అందించారు. ఏ రోజూ రెండో ట్యూన్ మేము అడగలేదు. ఫస్ట్ ట్యూన్‌నే అంత బాగా ఇచ్చేవారు. నేను ప్రొడ్యూసర్‌గా ఆయనతో మూవీ చేస్తున్నాను.. అనేది చాలు.. అంతకంటే ఇంకేం కోరుకోను’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- బాలీవుడ్ కు దూరంగా నాగచైతన్య..లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ కారణమా?