E-Paper
Advertisement

స్విఫ్ట్, ఆల్టో కార్లు మాత్రమే తెలిసిన నాకు.. బెంజ్ కారు కొనే రేంజ్‌కి తీసుకెళ్లారు- SKN

స్విఫ్ట్, ఆల్టో కార్లు మాత్రమే తెలిసిన నాకు.. బెంజ్ కారు కొనే రేంజ్‌కి తీసుకెళ్లారు- SKN
Advertisement

Producer SKN: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా.. ‘కలర్ ఫొటో, బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలను అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్ (Producer SKN), సాయి రాజేశ్ నిర్మాణంలో రూపుదిద్దకుంటోన్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘గుర్తుందా’ అనే సాంగ్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కెఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

Also Read- రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడి మాటలు వింటే.. థియేటర్స్‌లో పడిపూజే!

బెంజ్ కారు కొనేలా చేశాడు

Advertisement

‘‘నాకు హిట్స్ వస్తున్నా, నిర్మాతగా నేను సినిమాలు చేసేందుకు ఎప్పుడూ తొందరపడలేదు. నా మనసుకు నచ్చిన కథ దొరికినప్పుడే సినిమాలు నిర్మించాలని అనుకున్నాను. ‘బేబి’ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హిందీలో బేబి రీమేక్ స్టార్ట్ చేశాం. కానీ, అంత సాఫీగా జరగలేదు.. కొన్ని అవాంతరాలు వచ్చాయి. తెలుగులో సినిమా చేయాలనుకుంటున్న టైమ్‌లో సాయి రాజేశ్ ఈ కథ చెప్పారు. ఈ కథతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ‘బేబి’ వంటి బిగ్ సక్సెస్ తర్వాత ఏ దర్శకుడైనా మరో పెద్ద ప్రొడక్షన్‌లోకి వెళ్లాలని అనుకుంటారు. కానీ నా చిన్ననాటి మిత్రుడు.. స్విఫ్ట్, ఆల్టో కార్లు మాత్రమే తెలిసిన నాకు.. బెంజ్ కారు కొనుక్కునేలా చేసిన దర్శకుడు సాయి రాజేశ్ నాతోనే సినిమా చేస్తున్నారు. నా దర్శకులు మారుతి, సాయి రాజేశ్, రాహుల్ సంకృత్యన్, రవి నంబూరి.. ఇలాంటి వారి వల్లే నేను ఈ వేదిక మీద నిలబడ్డాను. రవి నాకు సోదరుడు. ‘బేబి’ మూవీకి ఆయన చేసిన సపోర్ట్‌కు కృతజ్ఞతగా సాయి రాజేశ్ ఈ మూవీ డైరెక్షన్ చేసే ఛాన్స్ రవికి ఇచ్చారు. వాస్తవానికి తన కథల్ని మరో దర్శకుడికి ఇవ్వాలంటే సాయి రాజేశ్ చాలా ఆలోచిస్తారు. రవి ప్రతిభపై నమ్మకంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. రవికి రైటింగ్ మీద ఉన్న ప్రతిభ, సినిమాను రూపొందించడంలో ఉన్న కామన్‌సెన్స్ మా అందరికీ నచ్చాయి.

Also Read- ఎగురుతున్న ఫ్లైట్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్… తేడా కొట్టదు కదా?

మా పేర్లు ఉండటం అదృష్టం

Advertisement

‘క’ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం ఈ కథ విని వెంటనే చేస్తానని ముందుకొచ్చారు. మంచి కథల్ని ప్రేక్షకులకు చూపించాలనే తపన ఉన్న హీరో కిరణ్. ఈ కథను నిర్మించాలంటే మీకు ధైర్యం ఉండాలి, నటించాలంటే నాకు ధైర్యం ఉండాలంటూ శ్రీ గౌరి ప్రియ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. మేము మణిగాడ్ అని పిలుచుకునే మణిశర్మ సంగీత దర్శకత్వంలో నిర్మాతలుగా మా పేర్లు ఉండటం నిజంగా మా అదృష్టం. అనంత శ్రీరామ్ ఎంతో డెప్త్ ఉన్న పాటలు రాశారు. ఒక హానెస్టీ మూవీ చేసినప్పుడే టీమ్ అందరిలో ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. ‘చెన్నై లవ్ స్టోరీ’లోని ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ అందరికీ అలాంటి ఎగ్జైట్‌మెంట్ ఇస్తుంది. ఖర్చు ఎక్కువైనా మంచి క్వాలిటీ కోసం డాల్బీలో ఈ సినిమాను చేస్తున్నాం. ఈ విషయం చెప్పినప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రోత్సహించారు. మా సినిమాను జూన్ 26 అనుకున్నాం కానీ ఆ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వస్తోంది. మా సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్… బిగ్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న అట్లీ.. ఫాన్స్ కు పూనకాలే..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×