E-Paper
Advertisement

విజయ్‌కు బిగ్ షాక్.. త్వరలో స్టాలిన్ మళ్లీ సీఎం.. డీఎంకే ఎమ్మెల్యే జోస్యం!

విజయ్‌కు బిగ్ షాక్.. త్వరలో స్టాలిన్ మళ్లీ సీఎం.. డీఎంకే ఎమ్మెల్యే జోస్యం!
Advertisement

Anita Radhakrishnan: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ (CM Joseph Vijay) పై డీఎంకే పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 4 నెలలు కూడా కొనసాగదని జోస్యం చెప్పారు. డీఎంకే అధినేత స్టాలిన్ త్వరలోనే తిరిగి సీఎం కాబోతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి.

‘కూలిపోవడం ఖాయం’

తిరుచెందూరు ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్.. దక్షిణ తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సినిమా గ్లామర్‌తో రాజకీయాల్లోకి రావడం సులువే అయినా.. ప్రభుత్వాన్ని నడపడం అంత తేలికైన విషయం కాదని పేర్కొన్నారు. ‘విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఒకవేళ ఏర్పడినా.. అది 4 నెలల కంటే ఎక్కువ కాలం నిలబడదు. కూలిపోవడం ఖాయం’ అంటూ అనితా రాధాకృష్ణన్ ధీమా వ్యక్తం చేశారు. పరిపాలనా అనుభవం లేకపోవడం, స్పష్టమైన రాజకీయ విధానాలు లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు.

‘నీ భార్యకు సమాధానం చెప్పు’

Advertisement

మరోవైపు రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తానని చెబుతున్న విజయ్ కు తనదైన శైలిలో అనిత రాధాకృష్ణన్ చురకలు అంటించారు. ‘మహిళలకు భద్రత కాదు.. ముందు నీ భార్యకు సమాధానం చెప్పు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారానికి మీ భార్య, కూతురు వచ్చారా? అంటూ విజయ్ ను నిలదీశారు. మరోవైపు విజయ్ కేబినేట్ లో మంత్రిగా ఉన్న ఆదవ్ అర్జున్ పై కూడా విమర్శలు గుప్పించారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి.. తిరుచెందూర్ లో తనపై పోటీ చేయాలని సవాలు విసిరారు. అది తమ అడ్డా అని.. అక్కడ ఎవరినైనా ఓడిస్తామని అనిత రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. రూ. 397కే 5 నెలల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా!

‘త్వరలో స్టాలిన్ సీఎం’

Advertisement

ఇదిలా ఉంటే తిరుచెందూర్ సీటు.. 25 ఏళ్లుగా రాధాకృష్ణన్ కు కంచుకోటగా ఉంది. ఆయన 2001లో తొలిసారి అన్నా డీఎంకే తరపున ఆ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత డీఎంకే చేరి.. 2009లోనూ తన ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాగా, ఇటీవల కొలత్తూర్ నియోజకవర్గం నుంచి స్టాలిన్ ఓడిపోగా.. ఆయన తిరిగి ట్రిచి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనిత రాధాకృష్ణన్ కోరారు. కొలత్తూర్ ను సింగపూర్ ను తలపించేలా అభివృద్ధి చేసినప్పటికీ అక్కడి ప్రజలు.. స్టాలిన్ ను ఓడించడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు. అక్కడి ఓటర్లు పనికిరాని వారంటూ రాధాకృష్ణన్ ఘాటు విమర్శలు సైతం చేశారు. మరో 4 లేదా 6 నెలల్లో తమ నేత (స్టాలిన్) ముఖ్యమంత్రి అవుతారంటూ జోస్యం చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై
టీవీకే కార్యాలయం ఇప్పటివరకూ ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోవడం గమనార్హం.

Also Read: రాష్ట్ర ప్రభుత్వం సంచలనం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుండి.. ఓలా, ఉబర్, ర్యాపిడో ఔట్?

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×