Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాకా అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 2027 డిసెంబర్ నాటికి ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ రాకా సినిమా కోసం సుమారు 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ తన సినిమాలకు ఫిక్స్డ్ సాలరీ తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రముఖ నిర్మాత, కాలమిస్ట్ జి. ధనుంజయన్ అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ విధానం గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అల్లు అర్జున్ ఏ సినిమాకి కూడా ఫిక్స్డ్ సాలరీ తీసుకోలేదని ఈయన తెలియజేశారు. ఈయన నటించిన సినిమాలకు వచ్చే కలెక్షన్లలో ప్రతి ఒక్క రూపాయికి 30 పైసలు వాటా మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఒక సినిమా 1000 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబడితే ఆయన 300 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటారు. అదేవిధంగా 500 కోట్ల కలెక్షన్లు రాబడితే 150 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటారని ఈయన ఏదైనా సినిమాకు కమిట్ అయ్యారు అంటే మంచి సినిమా చేయాలని మాత్రమే తపన పడతారు తప్ప శాలరీ గురించి ఎక్కడ మాట్లాడరని ధనుంజయన్ వెల్లడించారు. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1,742.10 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇందులో 30% వాటా అంటే అల్లు అర్జున్ 522 కోట్ల రూపాయల లాభాన్ని అందుకొని ఉంటారని తెలియజేశారు.
నిర్మాతలకు ఒత్తిడి తగ్గుతుంది..
అల్లు అర్జున్ అనుసరిస్తున్నటువంటి ఈ 30 పైసల విధానం అనేది నిర్మాతలకు చాలావరకు ఒత్తిడిని తగ్గిస్తుందని ధనుంజయన్ తెలిపారు. ఈయన చెప్పిన విధానం ప్రకారం ఒక సినిమా 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తే లాభాల పంపిణీ విధానం వల్ల అందులో 25 కోట్లు తగ్గించవచ్చు ఇలా చేయటం వల్ల నిర్మాతలు ఫైనాన్షియర్లు వద్ద తీసుకోవాల్సిన డబ్బులతో పాటు వడ్డీ భారం కూడా తగ్గుతుంది. అయితే ఇప్పటికే ఈ విధానం బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి వారు అనుసరిస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోనే అల్లు అర్జున్ కూడా 30 పైసలు విధానం మంచి నిర్ణయమే అని అల్లు అర్జున్ బాటలోనే మరి కొంతమంది హీరోలు కూడా అనుసరిస్తే నిర్మాతలకు ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పాలి.
Also Read: రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పిన శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి.. ఎందుకంటే!