E-Paper
Advertisement

Puri – Vijay Sethupathi: పూరి సేతుపతి సినిమా టైటిల్ పోస్టర్..ఫస్ట్ లుక్ రిలీజ్…

Puri – Vijay Sethupathi: పూరి సేతుపతి సినిమా టైటిల్ పోస్టర్..ఫస్ట్ లుక్ రిలీజ్…
Advertisement

Puri- vijay Sethupathi: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. నిజానికి ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేసారు. ఈ సినిమాకు మొదట్లో ఎన్నో టైటిల్స్ వినిపించినప్పటికీ చివరికి ఈ సినిమాకు “స్లమ్ డాగ్” (Slum Dog) అని టైటిల్ పెట్టినట్టు తాజాగా పోస్టర్ ద్వారా వెల్లడించారు.

తట్టుకోలేని తుఫాన్ వస్తుంది..

హీరో విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో విజయ్ సేతుపతి చిరిగిన బట్టలతో చేతిలో కత్తి పట్టుకొని కళ్ళజోడుతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు. ఇక ఈ పోస్టర్ ను పూరి కనెక్షన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. మురికి వాడాల నుంచి ఎవరు తట్టుకోలేని తుఫాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది అంటూ ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రను తెలియజేస్తూ ఈ పోస్టర్ విడుదల చేశారు. ఇక స్లమ్ డాగ్ అనే టైటిల్ తో పాటు 33 టెంపుల్ రోడ్డు అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నిరాశ పరుస్తున్న పూరి సినిమాలు…

Advertisement

ఈ పోస్టర్ చూస్తుంటే కచ్చితంగా ఈసారి పూరీ గట్టి హిట్ కొట్టబోతున్నారని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోలు కూడా విజయ్ సేతుపతితో సినిమా చేయటానికి ముందు రాకపోవటతో కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమాకు సిద్ధమయ్యారు. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

ఈ సినిమాని పూరి కనెక్షన్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటి సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. మరి పూరి జగన్నాథ్ స్లామ్ డాగ్ ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈయన చివరిగా రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Also Read: Venkatesh: మన శంకర్ వరప్రసాద్ ఎఫెక్ట్.. వెంకీ పేరును మార్చేసిన అభిమానులు.. ఏమైందంటే?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×