E-Paper
Advertisement

CCL 2026 Schedule: నేటి నుంచే CCL మ్యాచ్ లు..తెలుగు వారియ‌ర్స్‌ షెడ్యూల్.. టైమింగ్స్‌, ఫ్రీగా చూడాలంటే

CCL 2026 Schedule: నేటి నుంచే CCL మ్యాచ్ లు..తెలుగు వారియ‌ర్స్‌ షెడ్యూల్.. టైమింగ్స్‌, ఫ్రీగా చూడాలంటే
Advertisement

CCL 2026 Schedule:  సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( CCL Celebrity Cricket League 2026 ) సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాల్టి నుంచి 12వ సీజన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. దాదాపు 15 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నమెంట్ కోసం మొత్తం నాలుగు నగరాలు సిద్ధమవుతున్నాయి. నాకౌట్ మ్యాచ్ లు అన్నీ కూడా హైదరాబాదులో నిర్వహించనుండగా… మిగిలిన మ్యాచులు విశాఖపట్నం, మధురై, కోయంబత్తూర్ లాంటి వేదికలలో జరగనున్నాయి.

Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ( CCL2026) షెడ్యూల్ ఇదే

Advertisement

స్టార్ హీరోలు అలాగే ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటులు ఆడే క్రికెట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ( CCL2026). అయితే ఇప్పటివరకు ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 11 సీజన్లు పూర్తిచేసుకుంది. ఇవాల్టి నుంచి 12వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్, పంజాబ్ దే షేర్ ( Punjab De Sher) వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్ ( Karnataka Bulldozers ) జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది.

తెలుగు వారియర్స్ ( Telugu Warriors) వర్సెస్ భోజ్‌పురి దబాంగ్స్ ( Bhojpuri Dabanggs ) మధ్య విశాఖపట్నం వేదికగా ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మరో మ్యాచ్ జరగనుంది. ఇలా జనవరి 25వ తేదీ వరకు లీగ్ దశలో మ్యాచ్ లు జరగనున్నాయి. రేపు జనవరి 17వ తేదీన పంజాబ్ ది షేర్స్ ( Punjab De Sher) వర్సెస్ తెలుగు వారియర్స్ మధ్య సాయంత్రం 6:30 గంటలకు విశాఖపట్నం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇక జనవరి 23వ తేదీన కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ మధ్య సాయంత్రం 6:30 కు కోయంబత్తూర్ వేదికగా మరో మ్యాచ్ ఉంటుంది. ఇది ఇలా ఉండ‌గా తెలుగు వారియర్స్ ( Telugu Warriors) కెప్టెన్ గా అఖిల్ అక్కినేని వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

హైదరాబాద్ వేదికగా నాకౌట్ మ్యాచులు

Advertisement

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నాకోటి మ్యాచ్ లు అన్నీ హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. జనవరి 31వ తేదీన సెమీఫైనల్ మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. అలాగే రెండవ సెమీఫైనల్ సాయంత్రం 6:30 కు అదే వేదికగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీన సాయంత్రం 6:30 కు హైదరాబాదులోనే గ్రాండ్ ఫైనల్ ఉంటుంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు అన్ని జియో హాట్ స్టార్ లో చూడవచ్చు.

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×