E-Paper
Advertisement

Konaseema prabhala utsavam: కోనసీమలో సంక్రాంతి ప్రభల ఉత్సవాలు, తరలివస్తున్న ప్రజలు

Konaseema prabhala utsavam: కోనసీమలో సంక్రాంతి ప్రభల ఉత్సవాలు, తరలివస్తున్న ప్రజలు
Advertisement

Konaseema prabhala utsavam: కోనసీమలో జగ్గన్నతోట ప్రభల ఉత్సవం మొదలైంది. వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవానికి ఇటీవల ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ‌ హోదా కల్పించింది. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రభల ఉత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇంతకీ ఈ ఉత్సవం విశేషమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

వైభవంగా కోనసీమలో ప్రభల ఉత్సవాలు మొదలు

Advertisement

సంక్రాంతితోపాటు ఏదైనా ఉత్సవం వచ్చిందంటే దానికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సంక్రాంతి తర్వాత కనుము, ముక్కనుమ రోజుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 100 వరకు ప్రభల ఉత్సవాలు జరుగుతాయి. అందులో చెప్పుకోవాల్సినది జగ్గన్నతోటలో జరిగే ప్రభల ఉత్సవం. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ ఉత్సవం గురించి ప్రస్తావించారు. ప్రభల తీర్థం విశేషం ఏంటి? కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, ఐనవిల్లి, అమలాపురం గ్రామీణ మండలాలకు చెందిన 11 గ్రామాల ప్రజలు దీన్ని కొనసాగిస్తారు. దీని గురించి చరిత్ర పెద్ద చరిత్ర ఉందని అక్కడివారు చెబుతుంటారు. జగ్గన్న తోటలో ఎలాంటి దేవాలయాలు ఉండవు.

Advertisement

ప్రభల తీర్థానికి తరలివచ్చిన భక్తులు

17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజు అయిన రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు.. 11 మంది ఏకాదశి రుద్రులంతా ఓ చోట కలవాలనే సంప్రదాయం ప్రారంభించారు. అదీ కూడా సంక్రాంతి మరుసటి రోజు కనుమ నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి కనుమ పండుగ రోజు ఏకాదశ రుద్రులు జగ్గన్నతోటలో సమావేశం అవుతారని ఆ ప్రాంతాల ప్రజల నమ్మకం.

ఈ సమావేశంలో లోక కళ్యాణం గురించి వారంతా చర్చించారని, అప్పటి నుంచి కోనసీమ ప్రాంతం నిత్యం పచ్చదనంతో కళకళలాడుతుందని ఆ ప్రాంత ప్రజల చెబుతుంటారు. ఆనాటి నుంచి నేటి వరకు జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం జరుగుతోందని చెబుతున్నారు.

ALSO READ: సంక్రాంతి ముసుగులో కేసినో దందా..  కోడి పందాల బరిలో ఘర్షణలపై వైసీపీ ఆగ్రహం

మొత్తం అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం గ్రామీణ మండలాలకు చెందిన 11 ఏకాదశ రుద్ర ప్రభలను జగ్గన్న తోటకు తీసుకొస్తారు ఆయా గ్రామాల ప్రజలు. కనుమ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తోటలో ప్రభలు కొలువు దీరుతాయి. ప్రజలు అక్కడికి వచ్చిన తర్వాత భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆయా గ్రామాలకు వాటిని తీసుకుని వెళ్తారు.

టన్నుల కొద్దీ బరువుండే ఈ ప్రభలను యువకులు ఎగువ కౌశిక నదిని దాటించి తమ భుజాలపై వాటిని తీసుకొస్తారు. ఈ సన్నివేశాన్ని చూసేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు అధికంగా తరలి వస్తారు. రాష్ట్ర పండుగ కావడంతో భారీగా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేలా డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×