E-Paper
Advertisement

ఒక షాపుతో మొదలైన కథ.. అబిడ్స్ గా ఎలా మారింది?

ఒక షాపుతో మొదలైన కథ.. అబిడ్స్ గా ఎలా మారింది?
Advertisement

Abids History: అబిడ్స్..హైదరాబాదులోని ఈ ప్రాంతం పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఏ చిన్న వస్తువు కావాలన్నా అయితే అబిడ్స్ కి వెళ్దాం పద అనేవాళ్ళే ఎక్కువ.ఇక పుస్తక ప్రియులకు అయితే ఈ  అబిడ్స్ ఒకరకంగా కేరాఫ్.ఇక ప్రతి రోజు కొన్ని లక్షల మంది అబిడ్స్ మీదుగా ప్రయాణిస్తుంటారు.అలాంటి ఈ అబిడ్స్ కి ఆ పేరు ఎలా వచ్చిందో మాత్రం చాలా మందికి తెలియదు .నిజానికి ఈ పేరుకి మూలం ఒక రాజు పేరో, లేక కోట పేరో,లేక యుద్ధం పేరోకాదు.మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు.. ఈ అబిడ్స్ అనే ప్రాంతానికి ఈ పేరు వచ్చింది మాత్రం ఒక వ్యక్తి నడిపిన షాపు పేరు నుంచే.

పేరు ఎలా వచ్చిందంటే 

Advertisement

అవును ..ఆల్బర్ట్ అబిద్ (Albert Abid) అనే ఆర్మీనియన్ యూదు వ్యాపారి పెట్టిన షాప్ పేరు నుండి అబిడ్స్ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.ఆ ఆల్బర్ట్ అబిద్ అనే వ్యాపారి హైదరాబాద్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆస్థానంలో వ్యక్తిగత నాయకుడిగా పని చేసేవాడు కూడా.అలా నిజాం ఆస్థానంలో పనిచేస్తున్న ఆల్బర్ట్ అబిద్ వ్యాపారంలో కూడా మంచి పేరు సంపాదించాడు.అయితే అప్పట్లో హైదరాబాదులో యూరోపియన్ శైలిలో  ఉండే పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ లు చాలా అరుదుగా ఉండేవి .

మీటింగ్ పాయింట్ గా అబిద్ అండ్ కంపెని

Advertisement

అలాంటి సమయంలో ఆల్బర్ట్ అబిద్ సరిగ్గా నగరం మధ్యలో అబిద్ అండ్ కంపెని (Abid & Company) అనే పేరుతో ఒక షాపుని  ప్రారంభించారట.ఇక ఆ షాపులో బట్టలు, దిగుమతి చేసిన వస్తువులు, విలాసంతమైన వస్తువులు,ఇంట్లో వాడే వస్తువులు ..ఇలా ఏది కావాలన్ ఆ షాప్ లో దొరకడంతో అది కాస్త హైదరాబాద్ లో ఫేమస్ అయిపొయింది .ఇక ఆ రోజుల్లో అక్కడి  ప్రజలు ఒకరికొకరు కలుసుకోవాలంటే ‘అబిద్ దుకాణం దగ్గర కలుసుకుందామా’..లేక ‘అబిద్ షాప్ కే పీచే’ అంటూ ఆపేరునే తమ మీటింగ్ పాయింట్ గా పెట్టుకునే వారట.అలా క్రమక్రమంగా ‘అబిద్ దుకాణం దగ్గర’,’అబిద్ షాప్ ముందర’ అనే మాటలు చాలా కామన్ అయిపోయాయి.ఇక క్రమమంగా అదే అబిద్ అనే పేరు కాస్తా అబిడ్స్ గా మారిందన్నది చరిత్రకారులు చెబుతున్న మాట.

ఏవి కొనాలన్న అందరూ అందరి ఫస్ట్ ఛాయిస్ అబిడ్స్

ఇక షాప్ చుట్టూ  వ్యాపార సంస్థలు,హోటల్స్,కార్యాలయాలు ఒక్కొక్కటిగా వచ్చి చేరడంతో ఆ షాపు పేరు కాస్త ఆ ప్రాంతం పేరుగా మారిపోయింది.అలా అప్పటినుండి అధికారిక పత్రాల్లో కూడా ఆ ప్రాంతాన్ని అబిడ్స్  ప్రాంతం గా నమోదు చేయడం ప్రారంభమైంది.అయితే అబిడ్స్ అంతలా అభివృద్ధి చెందడానికి మరో కారణం అది ఉన్న ప్రాంతమే.అవును.. ఒక పక్కన నాంపల్లి రైల్వే స్టేషన్, మరో పక్కన కోఠి, బషీరాబాద్,ఇంకో పక్కన చాదర్‌ఘాట్ వంటి ముఖ్య  ప్రాంతాల మధ్య ఈ అబిడ్స్ ఉండటంతో అది కాస్త వ్యాపారానికి మంచి అనువుగా ఉండి చాలా వేగంగా ఎదిగింది.ఇక ఒకప్పుడు హైదరాబాద్ లో పుస్తకాలు,గడియారాలు,చెప్పులు,స్టేషనరీ,ఎలక్ట్రానిక్స్,.. ఇలా ఏవి కొనాలన్న అందరూ అందరి ఫస్ట్ ఛాయిస్ అబిడ్స్ అయి ఉండేది.ఇక ఆదివారం అక్కడ పెట్టే పుస్తకాల మార్కెట్ ఎంత ఫేమసో  చెప్పక్కర్లేదు.

మరికొందరిలో బినాభిప్రాయం

అయితే  ఈ ప్రాంతం పేరు పై మరికొందరిలో బినాభిప్రాయం ఉంది. కొందరు చరిత్రకారులు ఆల్బర్ట్ అబిద్ వల్ల వచ్చిందని చెబితే మరి కొందరు అబిద్ ఎవన్స్ అనే వ్యాపారి పెట్టిన షాప్ వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు. వ్యక్తీ ఎవరైనా  వచ్చిన పేరు మాత్రం షాప్ తోనే అన్నమాట.ఇక ఆల్బర్ట్ అబిద్ కట్టిన అబిద్ అండ్ కంపెని బిల్డింగ్ రోమన్ స్టైల్లో అద్భుతంగా ఉండేదని గత చిత్రాలని చూస్తె అర్థం అవుతుంది.

ఇక 1939లో ఆ భవనాన్ని  కూల్చివేసి అక్కడ “ప్యాలెస్ టాకీస్” కట్టారు. ఆ తర్వాత అది కూడా పోయి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చింది.మొత్తానికి అక్కడ అబిద్ అండ్ కంపెని బిల్డింగ్ లేకపోయినా  ఆవ్యక్తి పేరు మాత్రం శాశ్వతంగా హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయింది. ఇది అబిడ్స్ వెనకాల ఉన్న కథ.

ఏది ఏమైనా ఒక వ్యక్తి ప్రారంభించిన చిన్న బిజినెస్ క్రమక్రమంగా హైదరాబాద్ లోని ముఖ్య ప్రాంతానికి పేరుగా మారిపోవడం నిజంగాహైదరాబాద్ హిస్టరీలో ఆసక్తికరమైన విషయం.

also read :కాంతార, డ్రాగన్, ధర్మన్.. రుక్మిణి వసంత్ ఖాతాలో అన్నీ క్రేజీ ప్రాజెక్టులే…… కానీ!

Related News

Voter Registration: ఈ నెల 24 దాటితే మీ ఓటు మాయం?.. వెంటనే ఈ ఒక్క పని చేయండి!

Tungabhadra Levels: బిగ్ అలర్ట్.. రాయలసీమను ముంచేయబోతున్న భారీ సంక్షోభం..?

మంచు కరిగినా తగ్గని క్రేజ్.. ఒక్కరోజే 24 వేల మంది! అమర్‌నాథ్‌లో ఏం జరుగుతోంది?

సిరిసిల్ల నేత అద్భుత ప్రతిభ.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర.. బరువు తెలిస్తే షాకవుతారు!

హర్మూజ్ జలసంధిపై ట్రంప్ ‘ట్యాక్స్ బాంబ్’.. భారత్‌పై ప్రభావం ఎంత?

వైష్ణవి, జాహ్నవిల జాడ ఏది? కన్నవారి కన్నీటికి సమాధానం ఎక్కడ? పోలీసులు ఫెయిల్?

Hit Run: ఆ ఒక్క క్లూతో.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి బిగ్ షాక్!

Big Stories

Advertisement
×