E-Paper
Advertisement

‘రాకా’, ‘చరణ్’ సినిమాల మధ్య నలిగిపోయిన ‘పుష్ప-3’.. ఇక రానట్టేనా?

‘రాకా’, ‘చరణ్’ సినిమాల మధ్య నలిగిపోయిన ‘పుష్ప-3’.. ఇక రానట్టేనా?
Advertisement

Pushpa 3: ఒక సినిమా హిట్ అయితేనే సీక్వెల్ ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. అలాంటిది ఇండస్టీ హిట్ అయితే ఇక ఆ ప్రాంచైజీ కంటిన్యూ చేయకుండా ఉంటారా ..కాని ఇండస్ట్రీ  సర్కిల్స్ లో  వినిపిస్తున్న టాక్స్ ప్రకారం రికార్డులని తిరగరాసిన పుష్ప 2 కి సీక్వెల్ కష్టమే అని వినిపిస్తుంది.వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్పని మొదట్లో ఒకే పార్ట్ తో ముగించాలనుకున్నారట .కానీ కేవలం కలెక్షన్స్ కోసమే రెండుగా డిజైన్ చేశారన్న విమర్శలు గట్టిగానే వినిపించాయి .

ఆ ఉత్సాహం కేవలం ఒక భ్రమ
అయితే డిసెంబర్ 2024 లో విడుదలైన పుష్ప 2 ది రూల్ సినిమా ముగింపులో పుష్ప: ది రాంపేజ్ అంటూ మూడో భాగానికి లీడ్ ఇవ్వడం అప్పట్లో అల్లు అర్జున్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. కానీ ఆ ఉత్సాహం కేవలం ఒక భ్రమ మాత్రమేనని, ఆర్భాటంగా ప్రకటించిన పుష్ప 3 అస్సలు పట్టాలెక్కే అవకాశమే లేదన్నది ఇన్ సైడ్ టాక్.దీనికి తోడు  పుష్ప 2 వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకు ఈ మూడో పార్ట్ గురించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు కూడా.
నిజానికి పుష్ప 3 అనేది కేవలం హైప్ కోసం సృష్టించిన పేరన్నది అర్థమవుతోంది. ఎందుకంటే  ఇన్ సైడ్ టాక్ ప్రకారం  ఇప్పటివరకు పుష్ప 3 కి సంబంధించిన కనీసం  లైన్ కూడా సిద్ధంగా లేదట . కేవలం పార్ట్ 2 కి క్లైమాక్స్ లో ఒక క్రేజీ ఎండింగ్ ఇవ్వాలనే తాపత్రయంతో ఆ పేరు తగిలించారే తప్ప, సుకుమార్ వద్ద దానికి సంబంధించిన ఎలాంటి స్క్రిప్ట్ వర్క్ జరగలేదని తెలుస్తుంది . అసలే సుకుమార్ ఒక స్క్రిప్ట్ ని ఒక కొలిక్కి తేవడానికి ఏళ్ల సమయం తీసుకుంటారు.
పుష్ప 3 ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టేశారా 
అలాంటిది పుష్ప 2 మేకింగ్ సమయంలోనే  సినిమాను సరైన టైమ్ లో కంప్లీట్ చేయడానికి ఎన్ని పాట్లు పడ్డారో తెలీంది కాదు.ఇక ఆ సమయంలోనే  అల్లు అర్జున్ కు, సుకుమార్ కు డిఫరెన్సెస్ వచ్చాయని ,ఒకానొక దశలో షూటింగ్ కి కూడా బ్రేకులు పడ్డాయని ఇండస్ట్రీ అంతా కోడై కూసింది. రోజురోజుకూ ఆలస్యమవుతున్న మేకింగ్ తో విసుగెత్తిపోయిన బన్నీ, పుష్ప లాంటి హెవీ ప్రాజెక్ట్ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని డిసైడ్ అయ్యాడట . మళ్లీ సుకుమార్ తో కలిసి మరో రెండేళ్లు అడవుల్లో గడపడం, ఆ లుక్ లోనే ఉండిపోవడం బన్నీకి ఎంతమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన పుష్ప 3 ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టేశారని టాక్.
బన్నీ డైరీ  నాలుగేళ్ల వరకు పూర్తిగా ప్యాక్
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫోకస్ మొత్తాన్ని మార్చేశారు. ఆయన అట్లీ దర్శకత్వంలో రాబోతున్న రాకా సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో అడ్వెంచరస్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తవడానికే చాలా సమయం పడుతుంది. దీని తర్వాత అల్లు అర్జున్ ఆల్రెడీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. లోకేష్ సినిమా అంటే కనీసం ఏడాదిన్నర సమయం పక్కా. అంటే బన్నీ డైరీ వచ్చే మూడు నాలుగేళ్ల వరకు పూర్తిగా ప్యాక్ అయిపోయింది.

Advertisement

ఇక మరోవైపు దర్శకుడు సుకుమార్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పుష్ప 2 తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావడానికి ఇక్కడి నుంచి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది. ఈ లెక్కన అటు అల్లు అర్జున్ చేతిలో ఉన్న సినిమాలు, ఇటు సుకుమార్ కొత్త చిత్రం పూర్తయ్యేసరికి కాలం చాలా ముందుకు జరిగిపోతుంది. అప్పటికి పుష్ప బ్రాండ్ పై ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుందా అంటే అనుమానమే
భ్రమల్లో బతుకుతున్న జగపతిబాబు
అయితే చిత్ర విచిత్రంగా ఈ ప్రాజెక్ట్ పై నటుడు జగపతిబాబు మాత్రం విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన పెద్ది సినిమా ప్రమోషన్ల ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతూ పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని, అందులో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. పుష్ప 2 లో జగపతిబాబు పాత్ర నిడివిని సుకుమార్ బాగా తగ్గించేశారు. ఆ సమయంలో జగపతిబాబుని శాంతింపజేయడానికి, పుష్ప 3 లో నీకు మంచి ప్రయారిటీ ఇస్తానని సుకుమార్ హామీ ఇచ్చారట. సుకుమార్ ఇచ్చిన ఆ మాటను పట్టుకుని జగపతిబాబు ఇప్పటికీ భ్రమల్లో బతుకుతున్నారు. కానీ అసలు హీరో, డైరెక్టర్ లకే లేని ఆసక్తి జగపతిబాబు చూపించడం గమనార్హం.

భవిష్యత్తులో ఈ ఇద్దరి మధ్య ఈగోలు పక్కన పెట్టి, అన్నీ కుదిరి, అద్భుతమైన కథ రెడీ అయితే తప్ప పుష్ప: ది రాంపేజ్ అనేది థియేటర్లలోకి రాదు.చూడాలి మరి ఈ గాసిప్స్ ని  సుక్కు – బన్నీలు ఏమైనా బ్రేక్ చేస్తారేమో !

Advertisement

also read :ఆదర్శ కుటుంబం అంటూ పాత చింతకాయ పచ్చడి కథేనా? త్రివిక్రమ్ మళ్లీ గుంటూరు కారం టేస్ట్ చూపిస్తాడా?

Related News

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన డిమోంటీ కాలనీ 3.. కొత్త రిలీజ్ డేట్ లాక్!

నిర్మాతలకు భారీ షాక్ ఇస్తున్న భాగ్యశ్రీ.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనా?

ఆస్కార్ అందుకున్న తొలి మహిళ.. ‘మై లెఫ్ట్ ఫుట్’ నటి మృతి!

బండ్లన్న ఇంట మొదలైన పెళ్లి సందడి.. మెగా ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానం!

Big Stories

Advertisement
×