E-Paper
Advertisement

ఆ 6 నెలలు నా కలల్ని నాశనం చేశాయి – ఆర్. మాధవన్

ఆ 6 నెలలు నా కలల్ని నాశనం చేశాయి – ఆర్. మాధవన్
Advertisement

R. Madhavan: సఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ హీరో ఆర్.మాధవన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా , రచయితగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న మాధవన్.. ఇటీవల ధురంధర్ సినిమాలోనూ తనదైన నటనతో అదరగొట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వైవిద్య భరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఈయన.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

6 నెలలు నా కలకి అడ్డంగా మారాయి..

అందులో భాగంగానే ఆర్ మాధవన్ మాట్లాడుతూ..” నేను జంషెడ్ పూర్ లో జన్మించాను మా అమ్మ బ్యాంకు మేనేజర్ కాగా మా నాన్న టాటా స్టీల్ లో ఉద్యోగిగా పనిచేసేవారు. కొల్హాపూర్ లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఎన్సీసీ క్యాండిడేట్ గా నేను చాలా చురుగ్గా ఉండేవాడిని. ఇక దాంతో నన్ను స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా కెనడాలో ఏడాది పాటు ఉండేందుకు ఎంపిక చేశారు. అలా యూకే లో కూడా కొద్దిరోజులు ఉన్నాను. ఆరు నెలల పాటు అక్కడ ఆర్మీలో శిక్షణ కూడా పొందాను .ఆ శిక్షనే నన్ను ఇండియన్ ఆర్మీలో చేరాలనే ఆసక్తిని కలిగించింది. అలా మన ఇండియాకి తిరిగి వచ్చాక ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడింది. దాంతో దరఖాస్తు కూడా చేసుకున్నాను. అయితే నా వయసు నిర్ణీత వయసు కంటే 6 నెలలు ఎక్కువ ఉండడంతో నా ఆర్మీ కలలన్నీ కూడా ఆవిరి అయిపోయాయి. అలా ఆ 6 నెలల వ్యవధి నా జీవితాన్ని అతలాకుతలం చేసింది అంటూ ఆర్ మాధవన్ బాధపడ్డారు .ఇక మొత్తానికి అయితే ఆ 6 నెలల వయసు ఎక్కువ ఉండడం వల్లే తన కలను నెరవేర్చుకోలేకపోయానని చెప్పారు ఈ హీరో.

Advertisement

also read:పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాశీ ఖన్నా.. అదృష్టం పండనుందా?

స్టూడెంట్ వల్లే నటుడిగా మారాను..

ఇక ఈయన మాట్లాడుతూ..” పబ్లిక్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేషన్ లో ట్రైనింగ్ తీసుకొని ఆ అనుభవంతోనే క్లాసులు కూడా చెప్పడం మొదలుపెట్టాను. ఒక స్టూడెంట్ ఇచ్చిన సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాను. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ఒక హిందీ సీరియల్ లో అవకాశం వచ్చింది . రియాలిటీ షోలు కూడా చేశాను. ఆ తర్వాత సినిమా అవకాశం లభించింది. కానీ అది ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత తీసిన సినిమా కూడా ఫ్లాప్. అలా వరుసగా రెండు పరాజయాలతో నిరాశలో ఉన్న నాకు మణిరత్నం నుంచి ఫోన్ వచ్చింది. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ఎలయ్ పాయుతే . ఈ చిత్రంతో మొదటి విజయాన్ని అందుకున్నాను. అదే తెలుగులో సఖి మూవీ.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ నేను వెనుతిరిగి చూసుకోలేదు” అంటూ మాధవన్ తెలిపారు. మొత్తానికి అయితే ఆర్మీలో చేరాలనుకున్న తన కలను ఆ ఆరు నెలలు నాశనం చేసింది అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×