E-Paper
Advertisement

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాశీ ఖన్నా.. అదృష్టం పండనుందా?

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాశీ ఖన్నా.. అదృష్టం పండనుందా?
Advertisement

Raashii khanna: ఇటీవలకాలంలో కొంతమంది హీరోయిన్స్ సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతూ.. సరైన పాత్ర పడితే తమ పెర్ఫార్మన్స్ ను కనబరచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో రాశీ ఖన్నా కూడా ఒకరు. ఇటీవల పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో గట్టి కం బ్యాక్ ఇవ్వాలని కోరుకున్న ఈ అమ్మడికి పూర్తి నిరాశ మిగిలింది. ఆ నిరాశను ఏ మాత్రం కనబరచకుండా తన కెరియర్లో వైవిద్యమైన పాత్రను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే తాజాగా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమయ్యింది ఈ చిన్నది.

డిజిటల్ ప్లాట్ఫామ్ పై రాశీ ఖన్నా..

అయితే ఈసారి వెండితెరపై కాకుండా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై తన ముద్ర వేయాలని చూస్తోంది. అందులో భాగంగానే ‘లుఖ్కే’ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. హిమాంక్ గౌర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సిరీస్ పంజాబ్ బ్యాంక్ డ్రాప్ లో సాగుతుంది. ముఖ్యంగా డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసే ఒక ఇంటెన్స్ పోలీసు డ్రామాగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో రాశి కన్నా తోపాటు పాలక్ తివారీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఈ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో తనను తాను నిరూపించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఈమె.. తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకుంది.

Advertisement

also read:అలాంటి సినిమాల్లో నటించాలనుంది.. శ్రీలీల కల నెరవేరేనా?

అలాంటి అదృష్టం లభించడం విశేషం..

రాశీ ఖన్నా సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తన పాత్ర గురించి మాట్లాడుతూ.. “ఈ సిరీస్లో నేను గుర్భానీ అనే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాను. ఇప్పటివరకు నేను ఎన్నో భాషలలో ఎన్నో రకాల పాత్రలు పోషించాను. అయితే ఎన్ని చేసినా ఈ పాత్ర మాత్రం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే నా మూలాలన్నీ పంజాబీ లోనే ఉన్నాయి. ఈ పాత్ర కూడా పంజాబీ నేపథ్యం ఉన్నది కావడంతో నాకు చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ముఖ్యంగా ఇది సొంత ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతిని ఇచ్చింది “అంటూ తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ..” ఈ పాత్రలో ఎన్నో ఎమోషన్స్.. విభిన్నమైన కోణాలు దాగి ఉన్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్గా డ్రగ్స్ మాఫియా పై పోరాడుతూనే వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలను ఎలా ఎదుర్కొంటుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి గొప్ప పాత్ర లభించడం.. అందులో నేను నటించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది” అంటూ ఈ ముద్దుగుమ్మ తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక రాశీ ఖన్నా తదుపరి సినిమాల విషయానికి వస్తే. ఆర్ మాధవన్ తో కలిపి ఒక టైం ట్రావెల్ ప్రాజెక్ట్ లో భాగమైంది.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×