E-Paper
Advertisement

Actor Madhvan: వారణాసిలో హనుమంతుడిగా స్టార్ హీరో ఫిక్స్…ఇక మామూలుగా ఉండదుగా!

Actor Madhvan: వారణాసిలో హనుమంతుడిగా స్టార్ హీరో ఫిక్స్…ఇక మామూలుగా ఉండదుగా!
Advertisement

Actor Madhvan: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మొట్టమొదటి సినిమా వారణాసి (Varanasi). ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ రాజమౌళి సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. వారణాసి అని టైటిల్ ప్రకటించడమే కాకుండా ఇందులో మహేష్ బాబు (Mahesh Babu)రుద్ర పాత్రలో కనిపించబోతున్నారని తెలిపారు.

రాముడిగా మహేష్ బాబు..

ఇక ఈ సినిమా నుంచి నటుడు పృథ్విరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ కుంభ అనే పాత్రలో నటించగా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా రాముడి పాత్రలో మహేష్ లుక్ చాలా అద్భుతంగా ఉంది అంటూ స్వయంగా రాజమౌళి ఈ విషయాలను వెల్లడించడంతో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక రాముడు పాత్ర ఉంటుంది అంటే కచ్చితంగా హనుమంతుడి పాత్ర ఉండాల్సిందే.

హనుమంతుడిగా మాధవన్ ఫిక్స్?

Advertisement

ఈ సినిమాలో హనుమంతుడి(Hanuman) పాత్ర గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హనుమంతుడిగా కన్నడ నటుడు సుదీప్ నటించబోతున్నారని కాదు మాధవన్ నటించబోతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హనుమంతుడి పాత్రకు హీరో ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. హనుమంతుడిగా రాజమౌళి హాలీవుడ్ స్టార్ హీరో మాధవన్(Madhavan) ను ఎంపిక చేసినట్టు సమాచారం ఇప్పటికే రాజమౌళి మాధవన్ ను కలిసి ఆయనతో చర్చలు జరిపారని మాధవన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి ఆసక్తి కనబరిచారని తెలుస్తోంది.

ప్రమోషన్ల కోసమే 200 కోట్లు..

Advertisement

ఇలా మాధవన్ హనుమంతుడి పాత్రలో నటించడం దాదాపు ఖరారు అయిందని, ఇక త్వరలోనే అధికారక ప్రకటన వెల్లడి కాబోతోందని తెలుస్తోంది. ఇలా హనుమంతుడి పాత్రలో మాధవన్ అంటే కచ్చితంగా ఆ పాత్రకు సరిగ్గా సూట్ అవుతారంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక త్వరలోనే రాజమౌళి ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండబోతున్నాయని, ఇప్పటికే రణకుంభ, సంచారి అనే పాటలను విడుదల చేయగా ఈ పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నట్టు సమాచారం.. ఇక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కేఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాతలుగా గ్లోబల్ రేంజ్ లో ఈ సినిమాని విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం దాదాపు 1300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రమోషన్లకి అదనంగా 200 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం.

Also Read: Naga Chaitanya New Movie: ‘వృషకర్మ’గా నాగచైతన్య కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ గా ఉందే!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×