E-Paper
Advertisement

నక్కతోక తొక్కేసిన యూట్యూబ్ డ్యాన్స్ క్వీన్..మూవీలో ఛాన్స్..!

నక్కతోక తొక్కేసిన యూట్యూబ్ డ్యాన్స్ క్వీన్..మూవీలో ఛాన్స్..!
Advertisement

Dancer likhitha : యూట్యూబ్ డ్యాన్స్ వీడియోలతో బాగా ఫెమస్ అవుతున్నారు.. ముఖ్యంగా ఫోక్ సాంగ్ లలో డాన్స్ చేస్తున్న అమ్మాయిలకు మంచి క్రేజ్ లభిస్తుంది. అద్భుతమైన డాన్స్ తో హీరోయిన్లను మరిపించేస్తున్నారు అని నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉంటారు. అలాంటి అద్భుతమైన డాన్సర్లలో ఒకరు లిఖిత.. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా అతి చిన్న వయసులోనే ఈమె స్టార్ రేంజ్ కు చేరుకుంది.. యూట్యూబ్ ని షేర్ చేసిన రాను బొంబాయికి రాను సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. యూట్యూబ్లో రిలీజ్ అయిన ఈ పాట మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా ఆమెకు క్రేజ్ కూడా తీసుకొని వచ్చింది.. దాంతో లిఖిత డాన్స్ ని మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు.. ఇదిలా ఉండదా ఈ అమ్మడు నక్క తోక తొక్కింది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది. అవును నిజమే అని తెలుస్తుంది.. అదేంటంటే ఈ అమ్మడుకు ఓ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. నిజంగానే ఈమె వెండితెరపైకి అడుగు పెట్టబోతుందా..? లేదా అన్నది మనం ఇప్పుడు వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న లిఖిత.. 

యూట్యూబ్ లో ఫేమస్ అయిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు.. అలాంటి వారిలో కొంతమంది సినిమాలలో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు.. ఇప్పుడు ఆ లిస్టు లోకి రాను బొంబాయికి రాను భామ చేరింది.. త్వరలోనే వెండితెరపైకి అడుగుపెట్టబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఆమెను టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు.. సామ్రాట్, డిమాన్ పవన్ హీరోలుగా చేస్తున్న ‘సాV3’ అనే మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఈమె అందుకుందని తెలుస్తుంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు యూట్యూబ్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. డాన్సర్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న లిఖిత మరి సినిమాల్లో హీరోయిన్గా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Also Read :కీర్తి భట్  నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

హీరోగా డిమాన్ పవన్..

బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న చాలామంది ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈమధ్య ప్రతి ఒక్కరు కూడా టాప్ రేంజ్ కి వెళ్లాలని బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నారు.. అయితే ఇటీవల పూర్తయిన బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న డీమాన్ పవన్ ఇప్పుడు సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. అతనికి ఇదే మొదటి సినిమా అయినా కూడా చాలామంది జనాలు సక్సెస్ అవుతాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు డాన్సర్ అయిన లిఖిత కూడా అతనితో పార్ట్నర్ గా నటిస్తుంది.. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్ కి వెళ్తున్నాయి. మరి మంచి క్రేజ్ ఉన్నాయి ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.. ఇకముందు మంచి ఆల్బమ్స్ చేస్తానని లిఖిత ఈ మూవీకి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చెప్పారు.. ఒకవైపు సినిమాలు మరోవైపు డాన్సులతో మొత్తానికి లిఖిత అతి చిన్న వయసులోనే బిజీగా మారిపోతుంది.. త్వరలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతుందేమో చూడాలి..

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×