E-Paper
Advertisement

ఎండలో తిరగడం వల్ల పొడిబారుతున్న జుట్టు.. ఈ స్పెషల్ హెయిర్ మాస్క్‌తో సెలూన్ లాంటి ట్రీట్‌మెంట్

ఎండలో తిరగడం వల్ల పొడిబారుతున్న జుట్టు.. ఈ స్పెషల్ హెయిర్ మాస్క్‌తో సెలూన్ లాంటి ట్రీట్‌మెంట్
Advertisement

వేసవికాలంలో ఎండ ప్రభావం చర్మంపైనే కాదు, జుట్టుపై కూడా ఎక్కువగా పడుతుంది. అధిక వేడి కారణంగా జుట్టు సహజమైన మెరుపును కోల్పోయి పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అయితే కొన్ని సహజమైన హెయిర్ మాస్క్‌లను ఇంట్లోనే తయారు చేసుకుని ఉపయోగిస్తే జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. ఇవి జుట్టును లోతుగా కండిషన్ చేసి మళ్లీ మృదువుగా, మెరిసేలా మారుస్తాయి.

పెరుగు, తేనె హెయిర్ మాస్క్ జుట్టులో తేమ

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ తల చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది తలపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. తేనె వల్ల జుట్టుకు అవసరమైన తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది.

Advertisement

పెరుగు, తేనెను సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తల చర్మం, జుట్టుకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయాలి. ఈ మాస్క్ చుండ్రును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

లోతైన కండిషనింగ్‌ కోసం గుడ్డు హెయిర్ మాస్క్

గుడ్డు, ఆలివ్ ఆయిల్ కలయిక జుట్టుకు మంచి కండిషనింగ్‌ను అందిస్తుంది. ఈ మిశ్రమం జుట్టుపై సహజమైన రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఎండ వల్ల కలిగిన నష్టాన్ని తగ్గించి జుట్టుకు మళ్లీ మెరుపును తీసుకువస్తుంది.
ఒక గుడ్డులో రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి పఫింగ్ వచ్చేంతవరకు బాగా కలపాలి. ఈ మాస్క్‌ను జుట్టుకు పట్టించి 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లని నీరు, మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

డ్యామేజ్ జుట్టు కోసం అలోవెరా హెయిర్ మాస్క్

Advertisement

అలోవెరా జుట్టును బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది వెంట్రుకలు విరిగిపోకుండా కాపాడుతుంది. అలాగే పొడిబారిన తల చర్మానికి తేమను అందిస్తుంది.
అలోవెరా జెల్‌లో కొబ్బరి నూనె కలిపి మాస్క్ తయారు చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి ఒకసారి ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

అరటిపండు హెయిర్ మాస్క్

జుట్టు ఎక్కువగా చిక్కులు బారినట్లు, ఫ్రిజ్జీగా ఉంటే అరటిపండు మాస్క్ మంచి పరిష్కారం. పండిన అరటిపండును మెత్తగా చేసి అందులో తేనె కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తం పట్టించి 20 నుంచి 30 నిమిషాలు ఉంచాలి. తర్వాత సాధారణ నీళ్లతో, షాంపూతో కడగాలి. దీని వల్ల జుట్టు మృదువుగా మారి మంచి మెరుపును పొందుతుంది.

Also Read: స్నానం చేసేటప్పుడు జుట్టురాలిపోతోందా? నువ్వుల నూనెలో ఈ ఒక్కటి కలిపి పట్టిస్తే జుట్టుకి ఎంతో బలం

అవకాడో హెయిర్ మాస్క్ పొడిబారిన జుట్టుకు బెస్ట్

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు లోతైన పోషణను అందిస్తాయి. పండిన అవకాడోను మెత్తగా చేసి జుట్టుకు నేరుగా అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడగాలి. ఇది జుట్టు విరిగిపోవడాన్ని తగ్గించి సహజమైన మెరుపును అందిస్తుంది.

మంచి ఫలితాల కోసం అదనపు టిప్స్

ఈ హెయిర్ మాస్క్‌లలో ఏదైనా ఒకదాన్ని వారానికి రెండు సార్లు ఉపయోగించండి. క్రమం తప్పకుండా వాడితే ఒక నెలలోనే జుట్టు మృదువుగా, మెరిసిపోతూ ఆరోగ్యంగా మారుతుంది.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×