E-Paper
Advertisement

Indian Railways: నిరుద్యోగులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. 11,127 ALP పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 

Indian Railways: నిరుద్యోగులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. 11,127 ALP పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 
Advertisement

భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11,127 పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు అధికారికంగా ఆమోదం తెలిపారు.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా ఈ భారీ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ రైల్వే జోన్లలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడం ద్వారా రైళ్ల నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

ఈ నెలాఖరులోగా నియామకాలకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే మొత్తం 11,127 పోస్టులలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) లో కూడా భారీగానే పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 674 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను అధికారులు కేటాయించారు.

Advertisement

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ జోన్ పరిధిలో ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రైల్వే శాఖలో స్థిరపడాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. జోన్ల వారీగా ఖాళీల వివరాలను నోటిఫికేషన్‌లో స్పష్టంగా పొందుపరచనున్నారు.

విద్యార్హతల విషయానికి వస్తే.. టెన్త్ క్లాస్ పాస్ తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ITI) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ లేని పక్షంలో ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అర్హులే.

అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా పలు దశల్లో కొనసాగుతుంది. ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి CBT-2 పరీక్ష ఉంటుంది. ఈ రెండు దశల అనంతరం అభ్యర్థుల మానసిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నిర్వహిస్తారు.

రాత పరీక్షల్లో మెరిట్ మార్కులు కనబరిచిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియకు పిలుస్తారు. తుది దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల శారీరక ఫిట్‌నెస్‌ను పరిశీలించి నియామక పత్రాలు అందజేస్తారు.

రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

పూర్తి వివరాల కోసం అభ్యర్థులు భారతీయ రైల్వే అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నిరుద్యోగ యువత ఈ మెగా రిక్రూట్‌మెంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://indianrailways.gov.in/

ALSO READ: RRC Recruitment: రాత పరీక్ష లేదు.. కేవలం మెరిట్ ద్వారానే జాబ్, రైల్వేలో 5,349 ఉద్యోగాలు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×