RBI New Rules: ఏమైనా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవాలని భావిస్తుందా? ఒక్క క్షణం ఆలోచించండి.. ఏమైనా పాత బకాయిలుంటే వెంటనే కట్టేయండి? మనల్ని ఎవరు పట్టించుకోరని ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే ఆర్ఐబీ కొత్త రూల్స్ ప్రకారం కొత్త లోన్లు తీసుకోవాలంటే కొన్ని రూల్స్ పాటించాలి, లేకుంటే కష్టమే? అదెలా అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్.. లోన్లు తీసుకునేవారికి షాకింగ్ న్యూస్
లోన్లు తీసుకునేవారికి కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తోంది ఆర్బీఐ. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ కొత్త రూల్స్ ప్రకారం సిబిల్ స్కోర్ తక్కువుంటే రుణాలు పొందడం కష్టమే. బ్యాంకులు రుణాలు డిఫాల్టర్లను తగ్గించేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది.
నార్మల్‌గా లోన్ కోసం ఏదైనా బ్యాంకు వద్దకు వెళ్తే కచ్చితంగా పాన్ కార్డు తీసుకుని సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. అందులో క్రెడిట్ స్కోర్ 730 కంటే తక్కువగా ఉంటే లోన్లు రావడం కష్టమే. ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ పేరుతో కొత్త నిబంధనలను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది ఆర్బీఐ. దీనికి సంబంధించి తెర వెనుక పనులు జరుగుతున్నాయి.
ఆర్బీఐ కొత్త రూల్స్.. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు
అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది. దాని ప్రకారం 730 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు కఠిన నిబంధనలు రానున్నాయి. క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేకున్నా, తక్కువున్నా వినియోగదారుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL) డైరెక్షన్-2026 కొత్త సంస్కరణలను వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది ఆర్బీఐ. ఒక్కమాటలో చెప్పాలంటే బ్యాంకింగ్ రంగంలో కీలకమైనది భావిస్తున్నారు. కొత్త సంస్కరణల ప్రకారం.. 730 కంటే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఇబ్బందులు తప్పవు. లోన్ ఇస్తారు కానీ, అధిక వడ్డీ, అదనపు పూచీకత్తు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది.
ALSO READ: ఇల్లు కొంటున్నారా? ఈ తప్పులు చేస్తే.. లైఫ్ లాంగ్ సంపాదన గోవిందా!
ఆర్బీఐ కొత్త నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. దేశంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దారులలో 62 శాతం మంది ఈ జాబితాలో ఉన్నట్లు గణాంకాల మాట. రుణ డిఫాల్ట్‌లు జరిగిన తర్వాత బ్యాంకులు స్పందిస్తున్నాయని, కొత్త నిబంధనల వల్ల ముందుగానే రుణ గ్రహీత రిస్క్‌ను అంచనా వేయనున్నాయి.
ఈఎంఐ ఆలస్యంగా చేయడం, అస్థిరమైన ఆదాయం, క్రెడిట్ వినియోగంలో పెరుగుదల వాటిని పరిగణలోకి తీసుకుని రుణాలను తిరస్కరించే అవకాశముంది. సిబిల్ స్కోర్ 730 కంటే ఎక్కువున్న వినియోగదారులు లేకపోలేదు. వారికి బ్యాంకులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నాయి.