E-Paper
Advertisement

‘సింగ్-గీతం’ మూవీ రివ్యూ.. సింగీతం గారి ‘సంగీత’ ప్రయోగం ఎలా ఉందో తెలియాలంటే?

‘సింగ్-గీతం’ మూవీ రివ్యూ.. సింగీతం గారి ‘సంగీత’ ప్రయోగం ఎలా ఉందో తెలియాలంటే?
Advertisement

Singeetham Review: సంగీతం + సింగీతం = ఒక వినూత్న ప్రయోగం. తెలుగు సినిమా అంటే కేవలం ఫైట్లు, డ్యాన్సులు మాత్రమే కాదు… అప్పుడప్పుడు వెండితెరపై మ్యాజిక్ కూడా చేయొచ్చు అని నిరూపించిన సినిమానే ఈ ‘సింగ్ గీతం’. మన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మార్క్ మిస్టరీ, ఫాంటసీ, ఒక మంచి సామాజిక సందేశాన్ని మేళవించి వైజయంతీ మూవీస్ టీం చేసిన ఒక క్రేజీ అటెంప్ట్ ఇది. సినిమాకు ప్రాణం ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్. కేవలం పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు… ఈ సినిమాలో డైలాగులే పాటలుగా సాగే ఒక కొత్త ఫార్మాట్‌ను ట్రై చేశారు. డియస్పి కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. అలాంటి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దామా..

Read also-Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి టెన్షన్.. నర్మద కు భాగ్యం పై అనుమానం.. భద్రకు ఘోర అవమానం..

కథేంటంటే..

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని ‘కుబేరపురం’ అనే ఒక ఊహాజనితమైన పల్లెటూరు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో బ్రహ్మయ్య (బెనర్జీ), అతని కూతురు రేణు (శాలిని కొండేపూడి) కలిసి ఒక మైనింగ్ కంపెనీ నడుపుతుంటారు. అదే ఊరిలో ప్రకృతిని, అక్కడ మిగిలి ఉన్న ఏకైక పెద్ద చెట్టును ప్రాణంగా ప్రేమించే అమ్మాయి గౌరి (అహిల్యా బమ్రూ). ఈ మైనింగ్ బిజినెస్‌లోకి ప్రతాప్ (అయాన్) భాగస్వామిగా వస్తాడు. అయితే, వ్యాపార లాభాల కోసం ఆ ఊరి చివరి చెట్టును నరికేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ బాధలో గౌరి గ్రామ దేవత అయిన కుబేరుడిని వేడుకుంటుంది. ఆ తర్వాత ఆ ఊరిలో ఊహించని వింతలు జరుగుతాయి. ఆ వింతల వల్ల ఊరి ప్రజలు ఎలాంటి భయాలు ఎదుర్కొన్నారు? చివరకు ఆ సమస్య ఎలా తీరింది? అనేదే మిగతా సినిమా.

సినిమా ఎలా ఉందంటే?

94 ఏళ్ల వయసులో కూడా దర్శకేంద్రుడు సింగీతం శ్రీనివాసరావు గారిలో ఉన్న క్రియేటివిటీ అస్సలు తగ్గలేదని ఈ సినిమా నిరూపిస్తుంది. ఇప్పుడున్న రొటీన్ యాక్షన్, రక్తం చిందే సినిమాల మధ్య ఇదొక స్వచ్ఛమైన ‘మ్యూజికల్ ఫాంటసీ’ ప్రయత్నం. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో పాత్రలు మామూలుగా మాట్లాడవు. మాటలే పాటలుగా మారిపోతాయి. మనకు ఒపెరా స్టైల్ తెలుసు కదా, సరిగ్గా అలాగే ఉంటుంది. టాలీవుడ్‌లో ఇలాంటి ప్రయోగం రావడం చాలా అరుదు.

Advertisement

ఫస్టాఫ్‌లో ఈ కొత్త తరహా నరేషన్‌కు అలవాటు పడటానికి ప్రేక్షకుడికి కొంచెం టైమ్ పడుతుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి కథలో వేగం, ఎమోషన్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ సీన్ లో గ్రామస్థులంతా తమ స్వార్థాన్ని మరిచిపోయి ఒకరికోసం ఒకరు నిలబడే సీన్ గుండెలకు హత్తుకుంటుంది.

Read also-Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!

ఎవరెలా చేశారంటే?

గౌరి పాత్రలో అహిల్యా చాలా చక్కగా ఒదిగిపోయింది. ఆమె కళ్ళలోనే మంచి ఎక్స్‌ప్రెషన్స్ పలికించింది. అయాన్ తన పరిధి మేర బాగానే చేశాడు. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో శాలిని కొండేపూడి నటన మెప్పిస్తుంది. నివేదా పేతురాజ్ కాసేపే కనిపించినా గుర్తుండిపోతుంది.

ఇక ఈ సినిమాకి రియల్ హీరో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. సాధారణ డైలాగులను కూడా మ్యూజికల్ నోట్స్‌గా మార్చడం చాలా కష్టమైన పని. డీఎస్‌పీ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలతో ఈ చిత్రానికి ప్రాణం పోశాడు. నాగ్ అశ్విన్ నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.

ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్లు, మాస్ డైలాగులు ఆశించే వారికి ఇది కాస్త బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. పాత్రలు ప్రతిదానికీ పాడుకుంటూ మాట్లాడుకోవడం కొందరికి చికాకు కలిగించవచ్చు. కానీ, రొటీన్ సినిమాలకు భిన్నంగా, ఒక వినూత్నమైన వెండితెర ప్రయోగాన్ని చూడాలనుకునే వారికి, ముఖ్యంగా సింగీతం గారి మేకింగ్ స్టైల్‌ని ఇష్టపడే వారికి ‘సింగ్-గీతం’ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

బలాలు

  • దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
  • సెకండాఫ్‌లో పండిన భావోద్వేగాలు
  • అహిల్యా బమ్రూ నటన

బలహీనతలు

  • అందరికీ కనెక్ట్ అవ్వని నరేషన్ స్టైల్
  • సింపుల్‌గా ఉన్న కథ
  • ఫస్టాఫ్‌లో సాగదీత సీన్లు
  • కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

మొత్తంగా.. ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న వినూత్న మ్యూజికల్ ఫాంటసీ చిత్రం..

Singeetham Review Rating – 3 / 5

Related News

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Big Stories

Advertisement
×