E-Paper
Advertisement

లారెన్స్ సరసన సాయి పల్లవి, జాన్వీ? .. 30వ సినిమాలో ఆ నలుగురు భామల హంగామా!

లారెన్స్ సరసన సాయి పల్లవి, జాన్వీ? .. 30వ సినిమాలో ఆ నలుగురు భామల హంగామా!
Advertisement

RL30 Heroines:మాములుగా సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరు భామలుంటేనే కళ్ళు తిప్పుకోవడం కష్టం,అలాంటిది ఏకంగా నలుగురు అందగత్తెలు అటాక్ చేస్తే..అవును ..కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ ఇపుడు ఏకంగా నలుగురు భామలతో ఆడిపాడబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీలో హాట్ న్యూస్ అయిపొయింది. అవును తను హీరోగా ‘RL-30’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న సినిమా కోసం
స్టార్ హీరోయిన్స్ నలుగురిని లైన్లో పెట్టాడట ఈ మల్టీ టాలెంటెడ్.

ఈ గ్లామర్ బ్యూటీలకి, ఆ హర్రర్ స్టోరీలకి ఎలా సింక్ అవుతుందో 

Advertisement

అయితే మాములుగా ఇలాంటి సినిమాలలో బడ్జెట్ పెరగకుండా ఉండటానికి కరిద్దరు స్టార్ హీరోయిన్స్ ని పెట్టి మిగతా ఒకరిద్దరిని మీడియం హీరోయిన్స్ ని పెట్టి మ్యానేజ్ చేస్తుంటారు.కానీ ఎక్కడా తగ్గేదేలే అంటూ ఏకంగా సాయి పల్లవి, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్, కయాదు లోహర్ అంటూ నలుగురు మోస్ట్ వైటెడ్ భామలని తన సినిమాలో ఆన్ బోర్డ్ చేయబోతున్నాడన్న వార్త ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.వినడానికి బానే ఉన్నా ..హర్రర్ సినిమాలు తీసుకుపోయే లారెన్స్ ఈ అందమైన భామలని ఎక్కడ ప్లేస్ చేస్తాడు,అసలు ఈ గ్లామర్ బ్యూటీలకి, ఆ హర్రర్ స్టోరీలకి ఎలా సింక్ అవుతుంది అన్నది ఫిల్మీ ఫ్యాన్స్ వేస్తున్న క్వశ్చన్.

రాఘవ లారెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది హర్రర్ సినిమాలే

Advertisement

నిజానికి ఫ్యాన్స్ వేస్తున్న ప్రశ్నలో కూడా లాజిక్ ఉంది.ఎందుకంటే రాఘవ లారెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది హర్రర్ సినిమాలే 2007లో ముని కావచ్చు,ఆ తర్వాత వచ్చిన ‘కాంచన’ సిరీస్ కావచ్చు,లేదా ఈ మధ్య వచ్చిన ‘చంద్రముఖి 2’కావచ్చు,అన్నింటా ఒకటే స్టైల్.అదే తెల్ల బట్టల్లో దెయ్యాల చుట్టూ తిరగడం,లేదా తనే దయ్యంగా మారి విలన్ లని తిప్పి తిప్పి కొట్టడం.మరి ఇలాంటి జానర్ లో సినిమాలు తీసే లారెన్స్ వారిని ఎలా ఇరికిస్తాడో చూడాలి.

also read:సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా గళమెత్తిన కిరణ్ రావు…ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

ఇక ఈ సినిమాని ‘తిరుపుగల్’ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని ,ఇదో ‘ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్’ జానర్ లో రాబోతుందని టాక్.పైగా దీనిని తన సొంత బ్యానర్ ‘రాఘవేంద్ర ప్రొడక్షన్స్’ తీస్తుండగా దీనికి లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం ఇస్తుండటం విశేషం.

వీరితో ఎలాంటి ఫీట్లు చేయిస్తాడో

సాయి పల్లవి విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం తో బిజీ అయిపోగా జాన్వీ పాప పెద్దితో సందడి చేసిందే,ఇక రుక్మిణి వసంత్ గురించి చెప్పక్కర్లేదు, డ్రాగన్ ,టాక్సిక్ వంటి పెద్ద ప్రాజెక్ట్స్ ఈమె చేతిలోనే ఉన్నాయి, ఇక ప్యారడైజ్ తో పాటు సూర్య సినిమాలని తన గుప్పిట్లో పెట్టేసుకుంది కయాదు లోహార్ .మరి ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ పెట్టుకున్న లారెన్స్ వీరితో ఎలాంటి ఫీట్లు చేయిస్తాడో చూడాలి !

Related News

తెర వెనుక ఆదిత్య పంచోలి అసలు రంగు.. సోమీ అలీ సెన్సేషనల్ పోస్ట్ వైరల్!

ఆ 3 సెకన్ల సీన్ కొంపముంచింది…..వివాదంలో జాక్వెలిన్ కొత్త మ్యూజిక్ వీడియో!

సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా గళమెత్తిన కిరణ్ రావు…ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

మౌనీరాయ్ తో డేటింగ్.. అసలు నిజం బయటపెట్టిన అర్జున్!

దిల్ రాజు పంచాయితీ వర్కవుట్ కాలేదా? డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదురుతున్న రచ్చ!

గణిత మేధావి రామానుజన్‌కు ప్రీతి ముకుందన్ ఏమవుతుందో తెలుసా ?

ఒక్క హిట్ పడితే రేట్లు ఆకాశానికి.. ‘జైలర్ 2’ బేరసారాలపై ఇండస్ట్రీలో సెటైర్లు!

Big Stories

Advertisement
×