Sai Pallavi: బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ (Ramayana) సెట్స్ నుండి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి విషయంలో మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆమె ఇటీవల నటించిన హిందీ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడమే దీనికి కారణమని టాక్ నడుస్తోంది.
Read also-‘దూరదర్శని’ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది.. ప్రియదర్శి
సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ (Ek Din) బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా, అందులో సాయి పల్లవి హిందీ డైలాగ్ డెలివరీ మరియు భాషా ఉచ్చారణపై విమర్శలు వచ్చాయి. ఆమె హిందీ స్లాంగ్ అంతగా సెట్ కాలేదని, ‘రామాయణం’ లాంటి పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాకు ఇది సరిపోకపోవచ్చని నెటిజన్లు, విమర్శకులు అభిప్రాయపడ్డారు.
దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ (శ్రీరాముడు), యష్ (రావణాసురుడు) వంటి దిగ్గజాలు నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రకు హిందీ ఉచ్చారణ ఎంతో స్పష్టంగా, సహజంగా ఉండటం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో, ‘ఏక్ దిన్’ చిత్రంలో వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని, ‘రామాయణం’ హిందీ వెర్షన్ కోసం సాయి పల్లవి సొంత వాయిస్ కాకుండా, ఒక ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డైలాగ్స్ చెప్పించాలని చిత్ర బృందం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ప్రొడక్షన్ హౌస్‌కు చెందిన ఒక సన్నిహిత మూలం ద్వారా తెలిసింది. భాషా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా, సినిమాను పాన్-ఇండియా స్థాయిలో పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయడానికే మేకర్స్ ఈ మొగ్గు చూపుతున్నారట.
Read also-Honey Rose : హనీ రోజ్ రీఎంట్రీ.. మరో ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో..!
సాయి పల్లవి పాత్రకు డబ్బింగ్ చెప్పించబోతున్నారనే వార్త బాలీవుడ్, టాలీవుడ్‌లలో హాట్ టాపిక్‌గా మారినప్పటికీ, దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ గానీ, దర్శకుడు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సహజ నటనకు, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి.. ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. సౌత్ భాషల్లో సాయి పల్లవి వాయిస్ కు సపరేష్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే హందీలో ఆమె వాయిస్ అంతగా సింక్ కాక పోవడం సాయి పల్లవి ఫ్యాన్స్ కు ఆశ్ఛర్యాన్ని కలిగిస్తోంది. మరి ఏం నిర్మాతలు ఏం చేస్తారో చూడాలిమరి.