E-Paper
Advertisement

ఓటరు జాబితా సవరణలో గందరగోళం..!

ఓటరు జాబితా సవరణలో గందరగోళం..!
Advertisement

Voter Revision: స్వేచ్ఛ బ్యూరో: ఓటరు జాబితాలోని లోపాలు, తప్పులను సరి చేసి అసలైన వివరాలతో కూడిన ఓటరు జాబితాను రూపొందించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో క్షేత్ర స్థాయిలో ఈ ప్రక్రియ తూతుమంతంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అన్ని క్యాటగిరీల సిబ్బంది కొరతతో అల్లాడిపోతున్న జీహెచ్ఎంసీ స్పెటల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ఫీల్డు లెవెల్ లో నిర్వహించేందుకు నిరక్షరాస్యులైన పారిశుద్ధ్య కార్మికులతో పాటు నాలుగో తరగతికి చెందిన ఉద్యోగులను నియమించటంతో రివిజన్ క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో జరగటం లేదున్న విమర్శలున్నాయి.

ఎమ్మల్యే తలసాని శ్రీనివాసయాదవ్..

ముఖ్యంగా 2002, 2022 ఓటరు జాబితాలోని వివరాలతో క్రాస్ వెరిఫై చేసి, ప్రస్తుతమున్న ఓటరు జాబితాను మ్యాపింగ్ చేయాలన్నది ఈ రివిజన్ ప్రధాన ఉద్దేశ్యం కాగా, ఫీల్డు లెవెల్ లో ఈ ఉద్దేశ్యం నెరవేరటం లేదని పలు పార్టీల నేతలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ నేరుగా కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు. నిరక్షరాస్యులైన సిబ్బందిని రివిజన్ కు వినియోగించటం వల్ల చాలా చోట్ల సిబ్బందికి కనీసం ఫోన్ వినియోగం కూడా తెలియక సతమతమవుతున్నారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రివిజన్ ను ప్రతి ఇంటికెళ్లి నిర్వహించాల్సి ఉండగా, బూత్ లెవెల్ ఆఫీసర్లకు కేటాయించిన ఏరియాపై వారికి కనీస అవగాహన లేకపోవటంతో వారు మొత్తం రాజకీయ నేతలతో కలిసి ఈ రివిజన్ నిర్వహిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

ఓట్లను తొలగించేలా చర్యలు..

Advertisement

గతంలో కూడా ఓటరు జాబితాలోని తప్పులను సరి చేసేందుకు బూత్ ల వారీగా నియమితులైన బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటరు జాబితాను తీసుకుని ఇంటింటికి వచ్చి, ఒక్కో ఓటరు వివరాలను వెరిఫై చేసే వారు. దీంతో ఇళ్లు మారిన ఓటర్లు, చనిపోయిన ఓటర్ల సమాచారాన్ని సేకరించి, మృతి చెందిన ఓటర్ల డెత్ సర్టిఫికెట్లు తీసుకుని, సదరు ఓట్లను తొలగించేలా చర్యలు చేపట్టే వారు. కానీ ప్రస్తుతం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే సిటీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమితులైన బూత్ లెవెల్ ఆఫీసర్లలో సనత్ నగర్, సికిందరాబాద్, ఖైరతాబాద్, కంటోన్మెంట్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పాతబస్తీలోని మరి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఇంకా ఓటరు జాబితా కాపీ కూడా అందలేదని తెల్సింది.

Also Read: బీజేపీలో భగీరథ్ ప్రకంపనలు.. సొంత పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి స్వరం.. డైలమాలో కీలక నేతలు!

ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకుని మరీ..

Advertisement

మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నేరుగా ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను నిర్వహిస్తున్నారు. తమకు ఓట్లు పోలయ్యే అవకాశం లేని ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన ప్రజల ఓట్లను డిలీట్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. పాతబస్తీలో కూడా ఒక పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఓటర్లను చేర్చటం, తొలగించటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఒక ప్రాంతానికి నియమితులైన బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఆ ప్రాంతంపై అవగాహన లేకపోవటంతో పాటు కనీసం రివిజన్ ఎలా చేయాలన్న విషయంపై కూడా అవగాహన లేకపోవటంతో పూర్తిగా రాజకీయ నేతలపైనే ఆధారపడి ఈ ఇంటెన్సివ్ రివిజన్ ను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఫలితాలు అంతంతే..!

ఓటరు జాబితా సవరణ ఎపుడు నిర్వహించినా, ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను క్షేత్ర స్తాయివూ పరిశీలించకపోవటం, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలంటూ సిబ్బందిపై వత్తిడి ఉండటంతో పాటు సిబ్బంది కొరతో అంతంత్రమాత్రంగా చదువుకున్న ఉద్యోగులకు రివిజన్ బాధ్యతలను అప్పగించటం, కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన సిబ్బందిని ఈ బాధ్యతలను కట్టబెట్టడం వంటి కారణాలతో ఓటరు జాబితా సవరణ ఎపుడు చేపట్టినా, కనీసం సగం శాతం కూడా మంచి ఫలితాలు రావటం లేదన్న వాదనలున్నాయి.

కొద్ది నెలల క్రితం..

గతంలో కూడా ఇలాగే నిర్వహించిన ఓటరు జాబితా సవరణలో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓ ప్రాంతంలో ఒకే ఇంటి నెంబర్ పై ఏకంగా 80 ఓట్లు నమోదై ఉన్న విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. కొద్ది నెలల క్రితం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కూడా ఒకే ఇంటి నెంబర్ పై వందల సంఖ్యలో ఓట్లు నమోదైన వ్యవహారం కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపిన సంగతి తెల్సిందే. పక్కాగా నూటికి నూరు శాతం ఓటరు జాబితాలోని లోపాలను సరి చేసేలా అధికారులు ముందస్తు ప్రణాళికలేమీ లేకపోవటం వల్లే ఓటరు జాబితాలోని లోపాలు శాశ్వతంగా పరిష్కారం కావటం లేదన్న వాదనలున్నాయి.

Also Read: Keralam New Cm: కేసీ వేణుగోపాల్ కు షాక్.. కేరళం సీఎంగా వీడీ సతీశన్

Related News

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Big Stories

Advertisement
×