BigTV English

Rahul Ramakrishna: ఏంటి రాహుల్ భయపడ్డావా? ఏకంగా అకౌంట్ డిలీట్ చేశావ్!

Rahul Ramakrishna: ఏంటి రాహుల్ భయపడ్డావా? ఏకంగా అకౌంట్ డిలీట్ చేశావ్!

Rahul Ramakrishna: ప్రముఖ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) సినిమాలతో కెరీర్ కొనసాగిస్తున్నారు. అలాంటి ఈయన అనూహ్యంగా గత రెండు రోజులుగా ఎక్స్ ఖాతా ద్వారా సంచలన ట్వీట్ లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న కేసీఆర్(KCR ), కేటీఆర్ (KTR) లను ట్యాగ్ చేస్తూ నన్ను చంపేయండి అంటూ పోస్ట్ పెట్టిన రాహుల్.. నిన్న మహాత్మా గాంధీ (Gandhi ) జయంతి సందర్భంగా చేసిన ట్వీట్ ఆయనపై తీవ్ర వ్యతిరేకత నెలకొనేలా చేసింది. విషయంలోకి వెళ్తే రాహుల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో మహాత్మా గాంధీపై నిప్పులు చెరిగారు.


మహాత్మాగాంధీపై రాహుల్ సంచలన పోస్ట్..

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ప్రెస్ ఖాతా ద్వారా.. “గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదు” అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా గాంధీ జయంతి రోజు రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ఎక్స్ అకౌంట్ డిలీట్ చేసిన రాహుల్ రామకృష్ణ..

అయితే ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటల తర్వాత రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేయడం విశేషం. ఇది చూసిన చాలా మంది.. కొంతమంది రాజకీయ నాయకులు రాహుల్ ను బెదిరించి ఉంటారని, అందుకే అకౌంట్ డిలీట్ చేశాడని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది సమాజంలో తప్పుని తప్పు అని చెబితే ఇలాగే బెదిరిస్తారు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది మహాత్మా గాంధీని అసలు మహాత్ముడే కాదు అంటూ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు..ఇంకొంతమంది అయితే ఏకంగా ఏంటి రాహుల్ భయపడ్డావా? ఏకంగా అకౌంటే డిలీట్ చేశావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరిస్తున్నారు. అయితే రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ అకౌంట్ డిలీట్ చేయడం వెనుక అసలు కారణం మాత్రం బయటపడలేదు.


పరిస్థితులను కేటీఆర్ చక్కదిద్దాలి – రాహుల్

ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం రాజకీయాలను ఉద్దేశిస్తూ పెట్టిన ట్వీట్ కూడా సంచలనంగా మారింది. “మనం భయంకరమైన పరిస్థితులలో బ్రతుకుతున్నాము. వచ్చి పరిస్థితులను చక్కదిద్దాలని.. డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ రాహుల్ ట్వీట్ చేశాడు.

విసిగిపోయాను.. నన్ను చంపేయండి – రాహుల్

అలాగే ” నేను విసిగిపోయాను.. నన్ను చంపేయండి.. హైదరాబాదు మునిగిపోయింది. హామీలన్నీ కూడా విఫలమయ్యాయి.. వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు” అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ని కూడా ట్యాగ్ చేస్తూ మరొక ట్వీట్ చేశాడు.. అంతలోనే నిన్న మళ్ళీ గాంధీని ఉద్దేశిస్తూ పోస్ట్లు పెట్టడంతో ఆయనపై వ్యతిరేకత పెరిగిపోతుంది.

రాహుల్ రామకృష్ణ కెరియర్..

సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించి మొదటి సినిమాతోనే తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అందరిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హుషారు, గీతాగోవిందం, జాతి రత్నాలు, భరత్ అనే నేను వంటి చిత్రాలతో స్టార్ కమెడియన్ గా ఎదిగిన రాహుల్ రామకృష్ణ.. అటు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో కూడా కీలకపాత్ర పోషించి ఆకట్టుకున్నారు.

Also read: Breaking: నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు!

Related News

Kantara Chapter 1: కాంతార 2 ఫస్ట్ డే కలెక్షన్స్..ఆ సినిమాలన్నీ వెనక్కే?

Breaking: నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు!

Zubeen Garg: సింగర్ మృతి.. ఏకంగా వారందరిపై హత్య కేసు!

RGV vs RRR : ఆ మాటలతో మళ్లీ సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ

Ram Charan : ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించిన గ్లోబల్ స్టార్, లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Samantha: పండగపూట గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. విడాకుల తరువాత ఇలా!

Ravi Teja : సంక్రాంతి బరిలో రవితేజ సినిమా… స్పెయిన్ షెడ్యూల్‌తో ఫైనల్ టచ్

Big Stories

×