Nashra Sandhu Hit Wicket: మహిళల వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్… చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్లో టీమిండియా మొదటి విజయం నమోదు చేయగా పాకిస్తాన్ మాత్రం అత్యంత దారుణంగా తొలి మ్యాచ్ ఓడిపోయింది. అది కూడా బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే ఇలాంటి నేపథ్యంలో.. పాకిస్తాన్ కు చెందిన స్టార్ లేడీ ప్లేయర్ నష్రా సంధు ఇప్పుడు ట్రోలింగ్ కు గురయ్యారు. ఆమె బ్యాటింగ్ చేస్తూ హిట్ వికెట్ కావడమే దీనికి కారణం. అంతకుముందు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జెంట్స్ ను ధ్వంసం చేసినట్లు సిగ్నల్స్ ఇస్తూ సోషల్ మీడియాలో… ఆమె ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె… హిట్ వికెట్ కావడంతో ఇండియన్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025 ) భాగంగా నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మహిళల ( Bangladesh Women vs Pakistan Women ) జట్ల మధ్య ఫైట్ కు జరిగింది. ఇందులో పాకిస్తాన్ జట్టును చిత్తు గా ఓడించింది బంగ్లాదేశ్. దీంతో ఏడు వికెట్ల తేడాతో.. బంగ్లాదేశ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మహిళల జట్టు… 129 పరుగులకు ఆల్ ఔట్ అయింది. 38.3 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ మహిళల జట్టు.. 129 పరుగులకు కుప్ప కూలింది. అయితే ఈ నేపథ్యంలోనే… బౌలర్ గా పాపులారిటీ సంపాదించిన పాకిస్తాన్ లేడీ క్రికెటర్ నష్రా సంధు ఒకే ఒక పరుగు చేసి హిట్ వికెట్ అయింది. ఆమె హిట్ ( Nashra Sandhu Hit Wicket ) వికెట్ అయిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతకుముందు ఇండియన్ ఆర్మీ ని ఉద్దేశించి… ఆమె సిగ్నల్ ఇచ్చిన ఓ ఫోటో వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆరు జెట్స్ ను కుప్ప కూల్చినట్లు.. ఫోటోకు ఫోజులిచ్చింది నష్రా సంధు. ఆ ఫోటో బాగా వైరల్ అయింది. అదే సమయంలో… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంగా… నష్రా సంధు తరహాలోనే హారిస్ రవుఫ్ కూడా ఇండియన్ జెట్స్ ను పేల్చినట్లు… సైగల్ చేశాడు. ఇక అతన్ని బుమ్రా … క్లీన్ బౌల్డ్ చేసి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా నష్రా సంధు కూడా హిట్ వికెట్ కావడంతో… ఆమెను దారుణంగా ఇండియన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ జెట్ కుప్ప కూలింది అని ఆడుకుంటున్నారు.
Pakistan's Nashra Sandhu Got Hit Wicket Against Bangaladesh 😵💫#PakistanCricket #PAKvsBAN #PAKWvsBANW #banwvpakw pic.twitter.com/xRQuszYKwd
— Asia Cup 2025 (@bgt2027) October 3, 2025