Breaking: ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ఇంటికి ఇప్పుడు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆమె ఇంటి పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే త్రిష ఇంటికి మాత్రమే కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) నివాసానికి, గవర్నర్ భవనానికి కూడా ఇలా బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. ఇకపోతే సీఎం స్టాలిన్ తో సహా త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది అని చెప్పవచ్చు.
ఇకపోతే బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించగా.. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అది ఫేక్ కాల్ అని తేల్చేశారు. ఈ నేపథ్యంలోనే చెన్నై అల్వార్ పేటలోని సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఫోన్ నెంబర్ ఆధారంగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ప్రస్తుతం ఈ విషయంపై త్రిష స్పందించాలని అభిమానులు కూడా కోరుతున్నారు.
Also read: Zubeen Garg: సింగర్ మృతి.. ఏకంగా వారందరిపై హత్య కేసు!