Rahul Sankrityan:రణబాలి సినిమాతో తాజాగా భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ కుర్ర డైరెక్టర్ సినిమా కెరియర్ అంత సాఫీగా ఏం సాగలేదు. నిజానికి ఇప్పుడంటే వరుసగా వేర్వేరు జానర్స్ లో సినిమాలు తీస్తున్నాడు గాని ఒకప్పుడు ఈ కుర్ర డైరెక్టర్ ఇన్ఫోసిస్ ఉద్యోగి అన్న సంగతి మీకు తెలుసా.మరి ఈ ఇన్ఫోసిస్ ఉద్యోగి టాలీవుడ్ డైరెక్టర్ గా ఎలా మారాడో ఒకసారి చూద్దాం.
రాహుల్ సాంకృత్యన్ జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం. ఆయన పూర్తి పేరు తమ్మినేని రాహుల్ సాంకృత్యన్.రాహుల్ సాంకృత్యన్ తండ్రి కమ్యూనిస్టు భావజాలం ఉండటం కారణంగా చిన్నప్పటి నుంచే రాహుల్ కి పుస్తకాలు చదవడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అలవాటైందంట.ఇక ఇంట్లోని పుస్తకాలతో పాటు సినిమాలపై కూడా ఆసక్తి పెరిగింది.
ఇక రాహుల్ కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ కంప్లీట్ చేశాడు. అయితే చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేశాడు అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు .అయినప్పటికీ ఉన్న అందుబాటులో ఉన్న వాటి తోనే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.అయితే రాహుల్ కి సినిమా చేయాలంటే స్టోరీ ఒక్కటే రాయడం వస్తే సరిపోదని స్క్రీన్ ప్లే వంటి విషయాలపై గ్రిప్పు సాధించాలని అర్థమైంది.ఇక బీటెక్ పూర్తి అయిన తర్వాత రాహుల్ కి మైసూర్లో జాబ్ వచ్చింది.ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ కి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కొంతకాలం పని చేసాడు కూడా.అయితే జాబ్ చేస్తున్నప్పటికీ సినిమాలు పై ఉన్న ఆసక్తిని ఏమాత్రం వదులుకోలేదు.
జాబ్ చేసిన తర్వాత దొరికిన ఖాళీ టైం ని కథలు రాయడానికి ,షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి యూజ్ చేసుకునే వాడు .అలా రాహుల్ చేసే షార్ట్ ఫిలిమ్స్ లో అతడి కొలీగ్స్ కూడా కొందరు పార్ట్ అవడం విశేషం. ఇక ఆ సమయంలోనే చిత్రా ఐ లవ్ యు అనే షార్ట్ ఫిలిం రాహుల్ కి మంచి పేరు తీసుకొచ్చింది అయితే షార్ట్ ఫిలిం ఎడిటింగ్ జరుగుతున్న టైంలో రాహుల్ కి యాక్సిడెంట్ అవ్వటం మూలాన మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందట.అయినప్పటికీ ఆ షార్ట్ ఫిలిం ని పట్టుదలతో పూర్తి చేయడం విశేషం.
ఇక ఆ షార్ట్ ఫిలిం ఒక కాంపిటీషన్ లో గిఫ్ట్ గెలుచుకోవడంతో సినిమా చేసే అవకాశం వచ్చిందట .ఇక అలా 2014లో రాహుల్ ది ఎండ్ సినిమాతో డైరెక్టర్ పరిచయం అయ్యాడు .అయితే ఆ సినిమా తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయాలనుకున్నప్పటికీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డాడు.దాంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం కంటే పనిచేసుకుంటూ కథలు రాసుకునే సమయం దొరికే జాబ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట అదే టైంలో క్యాబ్ డ్రైవర్ గా కూడా పనిచేయాలని ఆలోచించారట కూడా.
ఈ క్రమంలోనే సెకండ్ హ్యాండ్ కార్ కోసం వెతుకుతుండగా ఒక పాత కారిపై రాహుల్ దృష్టి పడిందట ఆ కారు తక్కువ రేట్ కి ఉండటం దాని ఓనర్ చెప్పిన ఆన్సర్ కొంచెం క్యూరియస్ కనిపించడంతో ఆ కారు చుట్టూ కథ రాయగా అదే 2018 లో టాక్సీవాలా గా వచ్చింది .ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రాహుల్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది .ఇక ఆ తర్వాత రాహుల్ కెరీర్ ఎలా పరిగెట్టిందో మనందరికీ తెల్సిందే.
also read:రజినీకాంత్‌తో ‘జైలర్’ తీసిన నెల్సన్.. ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా?