E-Paper
Advertisement

షార్ట్ కట్‌లో కోటీశ్వరుడు కావాలని పాడు పని… రాత్రికి రాత్రే రోడ్డున పడే క్యాబ్ డ్రైవర్

షార్ట్ కట్‌లో కోటీశ్వరుడు కావాలని పాడు పని… రాత్రికి రాత్రే రోడ్డున పడే క్యాబ్ డ్రైవర్
Advertisement

Crime Thriller: ముంబైలో డ్రగ్స్‌ వ్యాపారం వెనుక ఎవరున్నారు ? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే నేరగాళ్లకు అండగా నిలిస్తే, నిజం కోసం పోరాడే వ్యక్తికి ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి ? ముఖ్యంగా సొంత కుటుంబానికి ప్రమాదం ఎదురైనప్పుడు ఒక పోలీసు అధికారి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ? ఇలాంటి క్రైమ్‌, సస్పెన్స్‌ అంశాలతో రూపొందిన సినిమానే ‘ కొకైన్’ (Cocaine 2026). అభిమన్యు సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డ్రగ్‌ మాఫియా, అవినీతి వ్యవస్థ, కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆరాటం చుట్టూ సాగుతుంది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? కథ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ముంబైలో కొకైన్‌ వ్యాపారం వెనుక శక్తివంతమైన డ్రగ్‌ మాఫియా ఉంటుంది. ఈ వ్యాపారాన్ని విస్తరించడానికి ఆ ముఠా ఎంత దూరమైనా వెళ్తుంది. వాళ్లకు పోలీసు అధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి కూడా సహకారం అందుతుంది. దీంతో నేరగాళ్లను పట్టుకోవాల్సిన వ్యవస్థలోనే కొందరు వారికి అండగా నిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజాయితీగా విధులు నిర్వహించాలనుకునే పోలీసులకు ఎదురయ్యే సవాళ్లను ఈ కథ చూపిస్తుంది.

Advertisement

ఈ సినిమాలో జలాల్‌ అనే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో అభిమన్యు సింగ్‌ కనిపిస్తాడు. డ్రగ్‌ మాఫియా ప్రభావం ఎంత బలంగా ఉందో అతనికి తెలిసొస్తుంది. నేరగాళ్లను ఎదుర్కోవడం అంత సులభం కాదని అర్థమవుతుంది. అయినప్పటికీ అతను తన విధులను నిర్వర్తించే ప్రయత్నం చేస్తాడు. అయితే, అతని సోదరుడే మాఫియా లక్ష్యంగా మారడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.

ఇప్పటి వరకు నేరగాళ్లను ఎదుర్కోవడమే అతని ముందున్న సవాలైతే, ఇప్పుడు సొంత కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అతనిపై పడుతుంది. ఒకవైపు డ్రగ్‌ మాఫియా నుంచి వచ్చే ముప్పు, మరోవైపు అవినీతికి పాల్పడుతున్న అధికారుల ప్రభావం… ఈ రెండింటి మధ్య జలాల్‌ చిక్కుకుంటాడు. తన సోదరుడిని రక్షించుకోవడానికి అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ? నేరగాళ్లతో పాటు వారికి సహకరిస్తున్న వ్యక్తులను కూడా ఎదుర్కోగలడా ? అనేదే సినిమాలో చూడాల్సిన కథ.

ఓటీటీలో తెలుగులో ఉందా?

Advertisement

‘కొకైన్ ‘ సినిమా జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే హిందీ ఆడియో మాత్రమే కనిపిస్తోంది. తెలుగు డబ్బింగ్‌ అందుబాటులో ఉంది. ముంబై అండర్‌వరల్డ్‌, డ్రగ్‌ మాఫియా, అవినీతి వ్యవస్థ నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్లు ఇష్టపడేవారు ఈ సినిమాను మస్ట్ వాచ్.

Read Also: కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి లండన్‌ వెళ్తే ఊహించని షాక్… తండ్రికి నరకం… మస్ట్ వాచ్ థ్రిల్లర్

Tags

Related News

భార్యాబిడ్డలను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌పై కక్ష తీర్చుకునేందుకు రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్… ఈ ఊచకోతను డోంట్ మిస్

కడుపున పుట్టిన పిల్లలకే ఆ తల్లి మృత్యువుగా మారితే… వెన్నులో వణుకు పుట్టించే హారర్ ను చూశారా?

ప్రళయాన్ని సృష్టించగల డేంజరస్ టెక్నాలజీ… అడ్డుకునేందుకు సైంటిస్ట్ ఒంటరి పోరాటం… మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

విదేశాల్లో ఇండియన్ డిప్లొమాట్ కిడ్నాప్… ప్రాణాలను పణంగా పెట్టి ఏజెంట్ సాహసం… ఎండ్లెస్ డేంజర్ మిషన్

కాలేజీ హాస్టల్‌లో వరుసగా మిస్సవుతున్న అమ్మాయిలు… సైకో కిల్లర్ మాస్ మర్డర్స్ వెనుక బిగ్ ట్విస్ట్

హైటెక్ పారిస్‌లో ఊహకందని హత్యలు… ఏఐ టెక్నాలజీతో ఆడుకుంటున్న సైకో కిల్లర్

ఆ అడవిలో చీకటి పడితే చాలు వింత శబ్దాలు… ట్రిప్ అంటేనే జడుసుకునే సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×