E-Paper
Advertisement

Suryapet Crime: భూవివాదం.. అక్క, మేనకోడళ్లను ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్యాయత్నం

Suryapet Crime: భూవివాదం.. అక్క, మేనకోడళ్లను ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్యాయత్నం
Advertisement

Suryapet Crime: భూవివాదంలో అక్క కుటుంబంపై తమ్ముడు హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్ గూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డికి తన అక్క కుటుంబంతో గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. వివాదంలో ఉన్న భూమిలో అక్క వరి కోతను ప్రారంభించగా తమ్ముడు ఉపేందర్ రెడ్డి వారిని అడ్డుకున్నాడు. ట్రాక్టర్ తో పంటను తొక్కిస్తూ.. సోదరి కుటుంబంపై దాడికి దిగాడు. ట్రాక్టర్ ను హార్వేస్టర్ ను ఢీకొట్టి డ్రైవర్ పై దాడికి దిగాదజు. అనంతరం తన సోదరితో పాటు ఇద్దరు మేనకోడళ్లను ట్రాక్టర్ తో తొక్కించి చంపేందుకు ప్రయత్నించాడు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముగ్గురికి తీవ్ర గాయాలు

తమ్ముడి దాడితో అక్క కుటుంబంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు ఉపేందర్‌రెడ్డి ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో మునగాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ బాధితులు సూర్యాపేట జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. హత్యాయత్నానికి పాల్పడిన ఉపేందర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Also Read: MLA Medipalli Satyam: ఎమ్మెల్యే సత్యం కాన్వాయ్‌కి రోడ్డు ప్రమాదం.. ఐదు కార్లు ధ్వంసం, తృటిలో తప్పిన పెను ప్రమాదం! 

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అక్క కుటుంబంపై సొంత తమ్ముడి విచక్షణారహితంగా దాడి చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రక్త సంబంధం కంటే డబ్బు, ఆస్తులకే విలువ ఇస్తున్నారని ఈ ఘటనతో మరోసారి రుజువైందని కామెంట్లు పెడుతున్నారు. ఆస్తులు కోసం హత్య చేసే స్థాయికి దిగజారుతున్నారని, క్షణికావేశంలో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అంటున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×