BigTV English

Rajamouli: మరీ అంత మాట అనేసావ్ ఏంటి జక్కన్న, అది ఫేవరెట్ సినిమా అయితే మిగతా సినిమాలేంటి.?

Rajamouli: మరీ అంత మాట అనేసావ్ ఏంటి జక్కన్న, అది ఫేవరెట్ సినిమా అయితే మిగతా సినిమాలేంటి.?

Rajamouli: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ఎస్.ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి తన కెరియర్ లో ఒక్కొక్క సినిమా చేసుకుంటూ తన స్థాయిని పెంచుకున్నారు.


 

రాజమౌళి కెరియర్ లో బాహుబలి సినిమా ఎంతటి గుర్తింపును సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ రాజమౌళి ఆ కథను బలంగా నమ్మి ప్రభాస్ ను ఐదేళ్లపాటు హోల్డ్ చేసి ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మిగతా ఇండస్ట్రీలు చూసే విధానం మారిపోయింది.


చాలా పెద్ద మాట అనేసారు 

రాజమౌళి విషయానికి వస్తే ఎవరిని అడిగినా ఆయన బెస్ట్ ఫిలిం బాహుబలి అని చెబుతారు. కానీ రాజమౌళి మాత్రం బాహుబలి కాదు, మగధీర కాదు, సింహాద్రి కాదు. నా బెస్ట్ ఫిలిం ఈగ అని తెలిపారు. రాజమౌళిని కూర్చోబెట్టి తన సినిమాలోని పోస్టర్స్ చూపించి సుమా మాట్లాడారు. అయితే ప్రతి సినిమా గురించి రాజమౌళి ఒక్కో ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఈగ సినిమా పోస్టర్ వచ్చిన తర్వాత ఈగ మై బెస్ట్ ఫిలిం అంటూ తెలిపారు. అప్పటికి ఈగ సినిమా చేయడం కూడా గ్రేట్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఈగతో కూడా సినిమాను చేయగలిగే సత్తా రాజమౌళికి ఉంది అని ప్రూవ్ చేశాడు. మొత్తానికి జూనియర్ సినిమా ఈవెంట్లో రాజమౌళి బెస్ట్ ఫిలిం ఈగ తనే ఒప్పుకున్నారు.

మగధీర సినిమా అంటే నాకు యాక్సిడెంట్ గుర్తొస్తుంది 

మగధీర సినిమా అంటే నాకు గుర్తొచ్చేది పీటర్ మాస్టర్ యాక్సిడెంట్. షాట్ ఒకే అయిపోయిన తర్వాత కూడా పైకెళ్ళి బైక్ తో స్టంట్ చేశారు. అది నాకు గుడ్ మెమొరీ కాదు బట్ మగధీర అంటే నాకు అదే గుర్తొస్తుంది. తను మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ గురించి మాట్లాడుతూ, నేను తారక్ చాలా రోజుల తర్వాత అదే లొకేషన్ కి వెళ్లి ఆ ఫోటోలను రీ క్రియేట్ చేశాను అంటూ తెలిపారు. అలానే సై సినిమా గురించి మాట్లాడుతూ నేను కేవలం యాక్షన్ ఫిలిమ్స్ మాత్రమే తీస్తాను అని అనుకున్న తరుణంలో ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చేశాను. రగ్బీ అని ఒక కొత్త ఆటను పరిచయం చేశాను. అక్కడితో నేను ఏమైనా చేయగలను అని నాకు అర్థమైంది అంటూ రాజమౌళి తెలిపారు.

Also Read : Rahul Ravindran : థియేటర్లకు వెళ్లేవాళ్లకి గుడి కట్టాలి, అంత మాట అనేసాడు ఏంటి.?

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×