YCP: వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. హిందూపురం వైసీపీ నేతలు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని నవీన్ నిశ్చల్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
నవీన్ నిచ్చల్ టికెట్ తనకే వస్తుందని ప్రకటించుకునడంతో.. ప్రస్తుత పార్టీ ఇంఛార్జీ దీపిక అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నవీన్ నిశ్చల్ , కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. హిందూపురం బలమైన నేతగా నవీన్ నిచ్చల్ గుర్తింపు పొందారు. అలాంటి బలమైన వ్యక్తిని సస్పెండ్ చేయడం ద్వారా దీపిక వర్గం బలమైన సంకేతాలు పంపింది.
ALSO READ: KTR: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది.. కవితను ఆ పోస్ట్ నుంచి తీసేసిన కేటీఆర్
ALSO READ: CM Revanth Reddy: బనకచర్లపై నో డిస్కషన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు