Rahul Ravindran : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన డైరెక్టర్లు రాహుల్ రవీంద్రన్ ఒకరు. అందాల రాక్షసి సినిమాతో నటుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. హను రాఘవపూడి దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలైనప్పుడు చాలామంది దర్శకుడు హనును మణిరత్నంతో పోల్చారు.
ఈ సినిమా తర్వాత దర్శకుడుగా హను సెటిల్ అయిపోయాడు. రాహుల్ రవీంద్ర కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ తన కెరియర్ ను సాగించాడు. అయితే చిలసౌ సినిమాతో రాహుల్ రవీందర్ని కూడా దర్శకుడుగా మారాడు. ఈ సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు లభించింది. ఇంత సెన్సిబుల్ దర్శకుడు ఉన్నాడా అని ఈ సినిమాతోనే అనిపించుకున్నాడు రాహుల్.
థియేటర్స్ కి వెళ్లే వాళ్లకి గుడి కట్టాలి
రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ థియేటర్ కు రావడం మానేశారు అనే విషయంపై అందరికీ ఒక అవగాహన వచ్చింది. కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ కు వచ్చే సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అలానే ఓటిటి వచ్చిన తర్వాత కూడా చాలామంది రావడం మానేశారు. ఒక పెద్ద హీరో సినిమా విడుదల అయితే మాత్రమే థియేటర్ కు ఆడియన్స్ వస్తున్నారు. రోజుల్లో ఒక సినిమా కి హౌస్ ఫుల్ బోర్డు చూడటం అనేది గగనం అయిపోయింది.
అయితే ఆడియన్స్ థియేటర్ కి రాకపోవడానికి ట్రాఫిక్ కూడా ఒక కారణం అని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అని చెప్పారు. ఇంతకు ఏం జరిగిందంటే ఒక జర్నలిస్ట్ తాను f1 సినిమా చూడటానికి వెళ్ళాలి అని అనుకుంటున్న తరుణంలో హైదరాబాద్ ట్రాఫిక్ చూసి విసిగి చెందుతున్నాను అని చెప్పడంతో, అదే మాటలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ప్రేక్షకుడు థియేటర్ రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అంటూ తెలియజేశాడు. అంతేకాకుండా ఇప్పుడు థియేటర్ కు వెళ్లి సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకి గుడి కట్టాలి అంటూ చెప్పుకొచ్చాడు.
కామెడీకి చెప్పిన కారణం
వాస్తవానికి ప్రేక్షకుడు థియేటర్ కి రాకపోవడానికి ట్రాఫిక్ కి పెద్దగా సంబంధం ఉండదు. ఎందుకంటే ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ఇబ్బంది అప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ ఒక మంచి సినిమాను చూసిన అనుభూతి ఎప్పటికీ మిగిలిపోతుంది. ఒకవేళ ఆ సినిమా ఫెయిల్ అయితే అది ఇంకో విషయం అనుకోండి. ఏదేమైనా రాహుల్ చెప్పిన మాటలకు కూడా కామెంట్స్ రూపంలో కొన్ని కౌంటర్స్ పడుతున్నాయి. మీరు మళ్లీ గుడి కడితే ఆ గుడికి కూడా ట్రాఫిక్ లోనే వెళ్లాలి అంటున్నారు కొంతమంది. ఇక ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ రష్మిక హీరోయిన్ గా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Peddi Movie: పెద్ది సినిమా కోసం అతిపెద్ద నిర్ణయం, ఆ ఒక్క దానికి 250 కోట్లు