E-Paper
Advertisement

Globe Trotter Release: గ్లోబ్ ట్రాటర్ రిలీజ్ డేట్ లీక్… ఆ నెలను టార్గెట్ చేసిన జక్కన్న!

Globe Trotter Release: గ్లోబ్ ట్రాటర్ రిలీజ్ డేట్ లీక్… ఆ నెలను టార్గెట్ చేసిన జక్కన్న!

Globe Trotter Release: టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter)అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో మొదటిసారి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే ఈ వార్తలకు నవంబర్ 15వ తేదీ పులి స్టాప్ పడబోతోంది. నవంబర్ 15వ తేదీ రామోజీ ఫిలిం సిటీ లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.

రుద్ర పాత్రలో మహేష్ బాబు..

ఇప్పటివరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే చేయని విధంగా రాజమౌళి ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమ ఏర్పాట్లలో రాజమౌళి ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు పాత్రకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు రుద్ర అనే టైటిల్ కూడా పెట్టవచ్చు అంటూ తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది.

లెటర్ బాక్స్ వెబ్ సైట్..

ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీనీ లీక్ చేయడంతో ఈ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని 2027 వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. కానీ ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాల గురించి మాత్రం క్లారిటీ లేదు అయితే అందుతున్న సమాచారం ప్రకారం 2027 మార్చి 25వ తేదీ ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని వరల్డ్ పాపులర్ సినిమా వెబ్ సైట్” లెటర్ బాక్స్”(Letter Box) ప్రస్తావించడంతో అనధికారికంగా ఈ విడుదల తేదీ లీక్ అయిందని తెలుస్తోంది.

మహేష్ బాబు ఫస్ట్ లుక్..

ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారడంతో రాజమౌళి RRR సినిమా విడుదల తేదీనే ఈసారి కూడా టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా 2022 మార్చి 25వ తేదీ విడుదల అయ్యి అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలను సృష్టించడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ హిట్ సెంటిమెంట్ డేట్ ను రాజమౌళి లాక్ చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల గురించి నవంబర్ 15వ తేదీ జరగబోయే కార్యక్రమంలో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమే కాకుండా టైటిల్ తో పాటు ఒక వీడియోని కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే ఒక పాటను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Revolver Rita Trailer: కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ మోడ్ లో మహానటి!

Related News

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×