E-Paper
Advertisement

Ananthapuram: అనంతపురంలో దారుణం.. భార్యపై అనుమానంతో వేట కొడవలితో నరికి చంపిన భర్త

Ananthapuram: అనంతపురంలో దారుణం.. భార్యపై అనుమానంతో వేట కొడవలితో నరికి చంపిన భర్త
Advertisement

Ananthapuram: కంటికి రెప్పలా కాపాడుతానని మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచిన భర్తే కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని, అత్యంత దారుణంగా సొంత ఇంట్లోనే వేట కొడవలితో నరికి చంపాడు. ఈ ఘోర సంఘటన అనంతపురం జిల్లా బెలగుప్ప మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. బెలగుప్పలో నివాసం ఉంటున్న ఆంజనేయులు, శాంతి దంపతులకు 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఎనిమిదో తరగతి చదివే కొడుకు, ఆరో తరగతి చదివే కూతురు ఉన్నారు. ఇంతకాలం వీరి కాపురం సజావుగానే సాగుతున్నట్లు కనిపించినా, గత కొంతకాలంగా వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ భర్త ఆంజనేయులు తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు.

Advertisement

ఈ నేపథ్యంలోనే గురువారం ఇంట్లో భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపంతో విచక్షణ కోల్పోయిన ఆంజనేయులు, ఇంట్లోనే భార్యపై వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఆమెను అత్యంత కిరాతకంగా నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో శాంతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

భార్యను చంపిన అనంతరం, ఆంజనేయులు నేరుగా బెలగుప్ప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్యపై అనుమానంతోనే తానే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ఎదుట నిందితుడు ఆంజనేయులు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Advertisement

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×