E-Paper
Advertisement

Rashmika mandanna: వేట మొదలు.. రష్మిక ఆసక్తికర పోస్ట్ వైరల్!

Rashmika mandanna: వేట మొదలు.. రష్మిక ఆసక్తికర పోస్ట్ వైరల్!
Advertisement

Rashmika mandanna: రష్మిక మందన్న(Rashmika mandanna).. తన అందం, అభినయంతో, నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకొని.. అభిమానుల చేత నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలిపించుకుంటున్న ఈమె ఎట్టకేలకు నేషనల్ వైడ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దాదాపు 8 ఏళ్లుగా రహస్య ప్రేమాయణం కొనసాగిస్తూ.. ఎట్టకేలకు తన మనసు మెచ్చిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ఏడడుగులు వేసింది.. ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధం లోకి అడుగుపెట్టింది ఈ జంట. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ వేడుక అత్యంత అట్టహాసంగా జరిగింది. ముఖ్యంగా తమ దుస్తులతో ఆభరణాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న విరోష్ జంట.. వివాహం అనంతరం తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు అందరికీ ఆదర్శంగా నిలిచాయి.

వివాహంతో అందరికీ ఆదర్శంగా విరోష్ జంట..

ఇక హైదరాబాదులో జరిగిన రిసెప్షన్ కి పలువురు సినీ, రాజకీయ నాయకులు వచ్చి సందడి చేశారు. భారత ప్రధాని కూడా విరోష్ జంటకు వైవాహిక బంధానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే వివాహమనంతరం హనీమూన్ కి వెళ్లాల్సిన ఈ జంట.. అప్పుడే తమ సినిమాల సెట్ లోకి అడుగుపెట్టారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం రణబాలి. మార్చి 12వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఒకవైపు తమ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు తమ పెళ్లి వేడుకకు సంబంధించిన పలు మధురమైన క్షణాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

Advertisement

వేట మొదలు – రష్మిక

నిన్నటికి నిన్న హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన రష్మిక మందన్న.. తాజాగా “వేట మొదలు” అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక పోస్టు అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది . అసలు వేట దేనికోసం మొదలయ్యింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేకపోతే రష్మిక మందన్న షేర్ చేస్తూ తాను మైసా సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు ప్రకటించింది. మైసా ఆన్ సెట్ కెమెరాలతో.. షూటింగ్ ప్రారంభమవుతున్న వేళ.. “మైసా ది హంట్ బిగిన్స్” అంటూ తన ఇన్స్టా స్టోరీ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే వివాహం అలా అయిందో లేదో అప్పుడే తన సినిమా షూటింగ్లో రష్మిక మందన్న పాల్గొనడంతో ఈమె డెడికేషన్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Advertisement

also read:Rajinikanth: రజినీకాంత్ ను రాజకీయాలలోకి రాకుండా బెదిరించారా.. తెర వెనుక నిజాలు!

మైసా సినిమా విశేషాలు…

మైసా సినిమా విషయానికి వస్తే.. హై ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రాబోతోంది. ఒక గోండ్ జాతి మహిళగా రష్మిక ఇందులో నటిస్తోంది. ఉగ్రమైన.. ధైర్యమైన.. రక్తసిక్తమైన అవతారంలో రష్మిక నటిస్తోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×