E-Paper
Advertisement

Prestige Vs Philips: అబ్బా.. ఏం ఫీచర్లండి బాబూ.. కుక్కర్ విజిల్స్ కూడా లెక్కపెట్టే అద్భుతమైన స్టవ్ ఇది!

Prestige Vs Philips: అబ్బా.. ఏం ఫీచర్లండి బాబూ.. కుక్కర్ విజిల్స్ కూడా లెక్కపెట్టే అద్భుతమైన స్టవ్ ఇది!
Advertisement

Prestige Vs Philips: ప్రస్తుతం గ్యాస్ ధరలు పెరగడం, సిలిండర్ కొరత కారణంగా చాలామంది ఇండక్షన్ స్టవ్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే మార్కెట్లో రకరకాల బ్రాండ్లు ఉండటంతో ఏది కొనాలో తెలియక కొంత గందరగోళానికి గురవుతుంటారు. ముఖ్యంగా మన దేశంలో నమ్మకమైన బ్రాండ్లు అనగానే ప్రెస్టీజ్, ఫిలిప్స్ పేర్లు వినిపిస్తాయి. ఈ క్రమంలో ఈ రెండింటిలో ఏది మెరుగ్గా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రెస్టీజ్ PIC 6.1 V3 ప్రత్యేకతలివే:

ఈ ప్రెస్టీజ్ మోడల్‌లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ‘ఆటోమేటిక్ విజిల్ కౌంటర్’. సాధారణంగా ఇండక్షన్ మీద కుక్కర్ పెట్టినప్పుడు విజిల్స్ లెక్కపెట్టుకోవడం కొంచెం కష్టమైన పని. కానీ ప్రెస్టీజ్‌లోని ఈ టెక్నాలజీ కుక్కర్ వచ్చే విజిల్స్‌ను గుర్తించి, వంట పూర్తయ్యాక ఆటోమేటిక్‌గా ‘కీప్ వార్మ్’ మోడ్‌లోకి వెళ్తుంది. ఇది వంట చేసే మన అమ్మలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఇది 2200 వాట్స్ పవర్‌తో వస్తుంది కాబట్టి.. వంట చాలా వేగంగా పూర్తవుతుంది.

Advertisement

Also Read: ఏసీ నుంచి వచ్చే ఈ 5 శబ్దాలను నిర్లక్ష్యం చేస్తే.. కంప్రెషర్ పేలిపోతుంది జాగ్రత్త!

2100 వాట్స్ పవర్‌తో ఫిలిప్స్ HD4928:

ఇక ఫిలిప్స్ ఇండక్షన్ స్టవ్ అంటేనే.. స్టైలిష్ డిజైన్, మన్నికకు పేరుగాంచింది. ఇది 2100 వాట్స్ పవర్‌తో పనిచేస్తుంది. దీనిలో ఉన్న ‘కూల్ టచ్’ ఫీచర్ వల్ల వంట చేసేటప్పుడు స్టవ్ చుట్టుపక్కల వేడెక్కదు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. అలాగే ఇందులో ముందే సెట్ చేసిన మెనూ బటన్స్ ఉండటం వల్ల, కొత్తగా వంట చేసేవారు కూడా ఈజాగా ఆపరేట్ చేయొచ్చు.

ఏ బ్రాండ్ ఉత్తమం?

Advertisement

ఈ రెండు కుక్‌టాప్‌లు కూడా మైక్రో క్రిస్టల్ గ్లాస్ ప్లేట్‌తో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఒకవేళ మీకు కుక్కర్ విజిల్స్ లెక్కబెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ప్రెస్టీజ్ మోడల్ తీసుకోవడం ఉత్తమం. లేదు, మాకు సింపుల్ డిజైన్‌తో పాటు ఎక్కువ కాలం మన్నే నమ్మకమైన బ్రాండ్ కావాలనుకుంటే ఫిలిప్స్‌ను కళ్లు మూసుకుని కొనేయొచ్చు. ఇక ధర పరంగా కూడా ఈ రెండు దాదాపు ఒకే రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి.

Also Read: గ్యాస్ స్టవ్‌కు పోటీగా డబుల్ ఇండక్షన్.. ఎల్‌పీజీ కొరత‌ను వాడేసుకుంటున్న ప్రెస్టీజ్ కంపెనీ!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్స్ లేదా దాని ప్రయోజనాలు.. ఆయా కంపెనీలపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×