E-Paper
Advertisement

R.Madhavan: కోలీవుడ్ స్టార్ కి ధురంధర్ టీమ్ ఊహించిన బిరుదు.. అసలేమైందంటే?

R.Madhavan: కోలీవుడ్ స్టార్ కి ధురంధర్ టీమ్ ఊహించిన బిరుదు.. అసలేమైందంటే?
Advertisement

R.Madhavan:రణ్‌వీర్ సింగ్ హీరోగా, ప్రతిభావంతుడైన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన హై-బడ్జెట్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఐతే సినిమా షూటింగ్‌లలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరగడం సహజం. కానీ, కోలీవుడ్ స్టార్ ఆర్. మాధవన్ (R.Madhavan)లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. ఈ సినిమా సెట్స్‌లో జరిగిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ సమయంలో మాధవన్‌కు ఒక వింత అనుభవం ఎదురైంది, అది చూసి చిత్ర యూనిట్ అంతా ఆయనకు ఒక క్రేజీ బిరుదు ఇచ్చేసింది. అదే రెయిన్ మ్యాన్. అసలు మాధవన్‌ను అందరూ ‘రెయిన్ మ్యాన్’ అని ఎందుకు పిలిచారు? ఈ సినిమా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

రెయిన్ మ్యాన్’ మాధవన్:

రీసెంట్ ఇంటర్వ్యూలో మాధవన్ తన అప్-కమింగ్ మూవీ ‘ధురంధర్’ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, సెట్స్‌లో అందరూ తనను ‘రెయిన్ మ్యాన్’ అని పిలిచేవారని సరదాగా వ్యాఖ్యానించారు. దీని వెనుక ఒక వింత కారణం ఉంది. మాధవన్ షూటింగ్ కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఊహించని విధంగా భారీ వర్షం కురిసేదట. అది కూడా కేవలం ఆయన ఉన్నప్పుడే వర్షం పడటం చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయింది. వర్షం కారణంగా షూటింగ్‌కు పదే పదే ఆటంకం కలగడంతో, టీమ్ అంతా కలిసి నవ్వుకుంటూ “నువ్వు వస్తే చాలు వర్షం గ్యారెంటీ” అంటూ ఆయనకు ఆ పేరు పెట్టేశారు. నిజానికి ఇది యాదృచ్ఛికమే అయినా, ఆ యూనిట్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది.

ధురంధర్’ మూవీ విశేషాలు:

Advertisement

ఈ భారీ యాక్షన్ డ్రామాలో మాధవన్ పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, భారతీయ సినిమా సత్తాను చాటినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో భారీ విజయం తర్వాత, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి అడుగుపెట్టింది.

ALSO READ:Suriya: కర్ణుడిగా సూర్య.. ఆరేళ్ళ కష్టం.. అంచనాలు పెంచిన డైరెక్టర్!

ఓటీటీలో కూడా సత్తా చాటుతూ..

Advertisement

ఇక జనవరి 30 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, అక్కడ కూడా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు మరియు మాధవన్, రణ్‌వీర్ సింగ్‌ల పర్ఫార్మెన్స్‌ను మళ్ళీ చూడాలనుకునే వారు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. మాధవన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్సివ్ గా, కథను మలుపు తిప్పే విధంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా మల్టీస్టారర్ కావడంతో బిజినెస్ పరంగా కూడా భారీ కలెక్షన్ల రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు సాధించన మూవీ గా చరిత్ర సృష్టించింది.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×